Ts News: మూసి పరివాహక ప్రాంతాల్లో 2వ ప్రమాద హెచ్చరిక

ABN , First Publish Date - 2022-07-27T18:12:29+05:30 IST

మూసీ నదీ (Musi river) పరివాహక ప్రాంతాల్లో అధికారులు 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

Ts News: మూసి పరివాహక ప్రాంతాల్లో 2వ ప్రమాద హెచ్చరిక

హైదరాబాద్ (Hyderabad): మూసీ నదీ (Musi river) పరివాహక ప్రాంతాల్లో అధికారులు 2వ ప్రమాద హెచ్చరిక (Warning) జారీ చేశారు. వరదతో మూసీ నది ఉప్పొంగుతోంది. దీంతో మూసీ పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. పరివాహక ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ప్రజలు భయాందోళనలు చెందుతుంటే జీహెచ్ఎంసీ (GHMC) అధికారులు పత్తాలేరు. బాధితులకు కనీసం పునరావాస కేంద్రాలు కూడా కల్పించలేదు.


భారీ వరద ప్రవాహంతో మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. జంట జలాశయాలు, హుస్సేన్‌సాగర్‌కు వరద పోటెత్తుతోంది. ఉస్మాన్‌సాగర్‌ (Osmansagar), హిమాయత్‌సాగర్‌ (Himayath sagar), హుస్సేన్‌సాగర్‌ (Hussain sagar)నుంచి భారీగా వరద నీరు మూసీలోకి ప్రవేశిస్తోంది. మూసీ నదిలోకి 21 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో మూసీ పరివాహక ప్రాంతాల్లో అధికారులు హైఅలర్ట్‌ ప్రకటించారు. మూసారంబాగ్‌, చాదర్‌ఘాట్‌, పురానాపూల్‌ వంతెనలపై రాకపోకలను నిలిపివేశారు. ఉస్మాన్‌సాగర్ నుంచి 8,281 క్యూసెక్కులు, హిమాయత్‌సాగర్ నుంచి 10,700 క్యూసెక్కులు, హుస్సేన్‌సాగర్ నుంచి 1,789 క్యూసెక్కుల వరద నీరు మూసీలోకి వెళుతోంది.  

Updated Date - 2022-07-27T18:12:29+05:30 IST