నన్ను పెళ్లి చేస్కో..లేదంటే మీ తల్లిదండ్రులను చంపేస్తా..

Jun 14 2021 @ 11:12AM

హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్ లో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. తనను పెళ్లి చేసుకోకపోతే మీ తల్లిదండ్రులను చంపుతానని  మైనర్ బాలికను యువకుడు బెదిరించాడు. వివారాల్లోకి వెళ్తే.. గత కొన్ని రోజుల క్రితం తనకు స్నేహితుడిగా పరిచమయ్యాడు యువకుడు. స్నేహం అనే ముసుగులో ప్రేమ పేరుతో ఆ బాలికను మోసం చేసాడు. అంతేకాకుండా తనను పెళ్లి చేసుకోవాలని యువకుడు యువతిని వేధింపులకు గురి చేసాడు. యువకుడు వేధింపులు భరించలేక యువతి మనోవేదనకు గురై ఫ్యాన్‎కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన బంజారాహిల్స్ ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడి కోసం గాలిస్తున్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.