Hyderabad Biryaniలో బొద్దింక

ABN , First Publish Date - 2022-08-27T16:06:19+05:30 IST

చింతల్‌లోని ఓ రెస్టారెంట్‌లో బిర్యానీ(Biryani restaurant)లో బొద్దింక వచ్చింది. దీంతో బాధితులు ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌కు

Hyderabad Biryaniలో బొద్దింక

హైదరాబాద్‌/కుత్బుల్లాపూర్‌: చింతల్‌లోని ఓ రెస్టారెంట్‌లో బిర్యానీ(Biryani restaurant)లో బొద్దింక వచ్చింది. దీంతో బాధితులు ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఫుడ్‌ఇన్‌స్పెక్టర్‌ చంద్రకాంత్‌(Food Inspector Chandrakant)హోటల్‌ను పరిశీలించారు. చింతల్‌కి చెందిన సూరేపల్లి రమేష్‌ తన స్నేహితులతో కలిసి బిర్యానీ తినటానికి ఈనెల 25న హాటల్‌కు వెళ్లారు. బిర్యానీలో బొద్దింక రాగా హోటల్‌ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. వారు దురుసుగా సమాధానం చెప్పడంతో అధికారులకు ఫిర్యాదు చేశారు. 

Updated Date - 2022-08-27T16:06:19+05:30 IST