HYD: బీజేపీ నిరుద్యోగ దీక్ష ప్రారంభం

ABN , First Publish Date - 2021-12-27T17:11:26+05:30 IST

బీజేపీ కార్యాలయంలో నిరుద్యోగ దీక్ష ప్రారంభమైంది.

HYD: బీజేపీ నిరుద్యోగ దీక్ష ప్రారంభం

హైదరాబాద్: బీజేపీ కార్యాలయంలో నిరుద్యోగ దీక్ష ప్రారంభమైంది. సోమవారం ఉదయం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ్, ఇంచార్జ్ తరుణ్ చుగ్ ముందుగా మహాత్మా గాంధీ చిత్రపటానికి నివాళి అర్పించి దీక్షలో కూర్చున్నారు. అలాగే విజయశాంతి, స్వామీగౌడ్, పొంగులేటి, వివిధ మోర్చాల అధ్యక్షులు తదితరులు దీక్షలో పాల్గొన్నారు. నిరుద్యోగ దీక్ష నేపథ్యంలో నిరుద్యోగులు భారీగా తరలివచ్చారు. బండి సంజయ్ దీక్ష నేపథ్యంలో బీజేపీ కార్యాలయం వద్ద భారీ బందోబస్త్‌ను ఏర్పాటు చేశారు. అటు నిరుద్యోగ దీక్ష చేస్తోన్న బండి సంజయ్‌కు గోనె ప్రకాశరావు సంఘీభావం తెలిపారు. 

Updated Date - 2021-12-27T17:11:26+05:30 IST