మంచి దిండు.. నిద్రకు ఫ్రెండు

ABN , First Publish Date - 2021-06-16T14:18:40+05:30 IST

అకారణంగా మెడ పట్టేయటానికి కారణాలు మాత్రం అనేకమున్నాయని స్లీప్‌ ఎక్స్‌పర్ట్స్‌ అంటున్నారు. అందులో మొదటిది తలకు సరైన సపోర్ట్‌ లేకపోవటం లేదా అసహజమైన రీతిలో

మంచి దిండు.. నిద్రకు ఫ్రెండు

సరైన ఎత్తు ఉంటేనే మెడ నొప్పి నుంచి ఉపశమనం 

వర్క్‌ ఫ్రమ్‌హోమ్‌ కాలంలో కూర్చునే భంగిమ కూడా ముఖ్యమేనంటున్న డాక్టర్లు


నిద్రలోనే చాలామందికి చాలావరకు ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి. కానీ, ఆ నిద్రలో వచ్చే సమస్యలు ఏమైనా ఉన్నాయా అంటే  మెడ పట్టేయడం తొలుత కనిపిస్తుంది. వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ కాలంలో కూర్చునే భంగిమ సరిగా లేకపోతే సమస్యలు కూడా అధికంగా ఉన్నట్లే. నిద్ర పోయే తీరు సరిగా లేకపోయినా మెడ పట్టేయడం కూడా జరుగుతుంది. కానీ, ఈ మెడనొప్పి సమస్యలకు పిల్లోల (తలగడలు)తో చెక్‌ పెట్టవచ్చంటున్నారు డాక్టర్లు. 


హైదరాబాద్‌ సిటీ: అకారణంగా మెడ పట్టేయటానికి కారణాలు మాత్రం అనేకమున్నాయని స్లీప్‌ ఎక్స్‌పర్ట్స్‌ అంటున్నారు. అందులో మొదటిది తలకు సరైన సపోర్ట్‌ లేకపోవటం లేదా అసహజమైన రీతిలో నిద్రపోవటం. సరైన తలగడలు వినియోగించటం ద్వారా ఈ సమస్యను తగ్గించుకోవచ్చని సుప్రసిద్ధ మ్యాట్రెస్‌ సంస్థ ప్రతినిధి మాధవన్‌ చెబుతున్నారు. ఇదే విషయమై స్లీప్‌ నిపుణులు వాసీమ్‌ మాట్లాడుతూ ‘వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌కాలంలో నెక్‌ పెయిన్‌తో ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందన్నారు. ఎక్కువ సేపు కంప్యూటర్స్‌తో కుస్తీపట్టడం. దీనికి తోడు మొబైల్స్‌తో ఎక్కువగా గడిపేవారు తల ఎక్కువగా అటు ఇటు తిప్పకపోవడం కూడా మెడ పట్టడానికి ఓ కారణంగానే చెప్పాల్సి ఉంటుందని’ అంటున్నారు. అయితే మెడనొప్పికి ఇవి మాత్రమే కారణాలు కాదని, ఒత్తిడి, ఊబకాయం, గాయాలు, అర్థరైటీస్‌ వంటి సమస్యలు కూడా మెడ నొప్పికి కారణాలుగానే నిలుస్తాయంటున్నారు.

 మెడనొప్పితో బాధపడే వారికి తలగడ మీద గడిపే 7-8 గంటలు నొప్పి నుంచి ఉపశమనానికి అత్యంత కీలకమైన సమయంగా నిలుస్తుందంటున్నారు నిపుణులు. అధ్యయనాలు వెల్లడించే దాని ప్రకారం మీరు నిద్రపోవడానికి ఉపయోగించే భంగిమ మీ మెడకు విశ్రాంతి కల్పించడం లేదా అదనపు ఒత్తిడి కలిగించడం చేస్తుంది. మీ మెడకు తగిన రీతిలో మద్దతునందించే తలగడ, అదే రీతిలో మెడ, వెన్నుముక తగిన రీతిలో ఉండేందుకూ తోడ్పడుతుంది. సరైన తలగడ లేకపోతే అది నిద్రాభంగం కలిగించడమే కాదు, మెడనొప్పికీ కారణమవుతుందని వెల్లడిస్తున్నాయి.  

 మార్కెట్‌లో ఇప్పుడు విభిన్న రకాల పి ల్లోస్‌, విభిన్నమైన మెటీరియల్స్‌, ఆకృతులు, ప రిమాణాలలో లభిస్తున్నాయి. మార్కెట్‌లో లభిస్తోన్న విభిన్నమైన పిల్లోస్‌, వాటి వినియోగాల ను గురించి మాధవన్‌ ఏం చెబుతున్నారంటే...


ఆర్థోపెడిక్‌ పిల్లోస్‌: ఈ పిల్లో్‌సని శరీరం లో సహజసిద్ధమైన ఒంపును నిర్వహించేలా తీ ర్చిదిద్దారు. దీనివల్ల ఎలాంటి మెడనొప్పి రాదు.

ఫెదర్‌ పిల్లోస్‌ : ఓల్డ్‌ ఫ్యాషన్‌ అయినా కానీ వాడే వ్యక్తికి ఎలర్జీల బాధలు లేకపోతే మాత్రం అత్యుత్తమ పిల్లో్‌సగానే చెప్పొచ్చు. ఈ తలగడలను వ్యక్తుల అవసరాలకు తగినట్లుగా మలుచుకోవచ్చు. అంతేకాదు ఫోమ్‌తో పోలిస్తే రెసిస్టెన్స్‌ తక్కువగా ఉంటుంది. మరీముఖ్యంగా వెన్నునొప్పి ఉన్నవారికి ఇది తగిన సౌకర్యం మాత్రం అందించలేదు.

సర్వికల్‌ పిల్లోస్‌ : ఇవి రోల్‌ షేప్డ్‌ పిల్లోస్‌. మెడ మీద ఒత్తిడి తగ్గించే రీతిలో వీటిని డిజైన్‌ చేశారు. నిద్ర పోయినప్పుడు మెడ, తల సహజసిద్ధమైన ఆకృతి ఇది నిర్వహించడం వల్ల  నెక్‌ పెయిన్‌ కూడా తగ్గుతుంది. 

వాటర్‌ ఫిల్డ్‌ పిల్లోస్‌ : బరువును స్వీకరించటంతో పాటుగా సమానంగా పంపిణీ చేయటం ద్వారా వాటర్‌ పిల్లో స్‌ మెడకు  సహకారం అందిస్తాయి. వాటర్‌ పిల్లో్‌సలోని మరో ప్రయోజనం ఏమిటంటే ఇది అందించే సహకారం వల్ల ఎలా కావాలనుకుంటే అలా మార్చుకునే సౌకర్యం కలుగుతుంది. ఎక్కువ నీటిని జోడించే కొద్దీ సపోర్ట్‌ కూడా పెరుగుతుంటుంది.

ట్రావెల్‌ నెక్‌ పిల్లోస్‌: సాధారణంగా ఈ నెక్‌ పిల్లోస్‌ యు-షే్‌పలో ఉంటాయి. ప్రయా ణ సమయాల్లో సుఖ నిద్రకి ఇవి ఎంతో తోడ్పడతాయి. తరచుగా ప్రయాణాల్లో ఉండేవారు ఈ పిల్లోస్‌ వెంట తీసుకుని వెళ్లటం ఉత్తమం. వీటిని సులభంగా బ్యాగ్‌లలో పెట్టుకోవటమే కాదు.. కారు సీట్స్‌పై కూడా వాడుకోవచ్చు.

తలనొప్పిగా ఉంటే నెక్‌ పిల్లోస్‌: తలనొప్పి గా ఉంటే తలగడ మీద పడుకుంటే తగ్గుతుం దా అని అంటే తగ్గే రీతిలో డిజైన్‌ చేశారిప్పుడు. ఇవి ఎక్కువ సపోర్ట్‌ అందించి తలపోటుని బాగా తగ్గిస్తాయి. ఈ పిల్లోలో అదనపు ఫీచర్‌గా ఐస్‌ -పాకెట్‌ ఉంటుంది. వీటిలో ఐస్‌పాక్స్‌ పెట్టడం వల్ల నెక్‌ గాయాలు లేదంటే ఇతర సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

మెమరీ ఫోమ్‌ పిల్లోస్‌ : సైడ్‌ స్లీపర్స్‌కి ఇవి అత్యుత్తమమైన పిల్లోస్‌ అని చెబుతున్నారు. కొన్న నాటినుంచి రెండేళ్ల వరకూ ఇవి అవసరమైన సౌకర్యం అందిస్తాయి. ఒకవేళ పిల్లోస్‌ అ వసరమైన సహకారం అందించలేకపోతే సైడ్‌ స్లీపర్స్‌ కాస్త నెక్‌పెయిన్‌ అనుభవించవచ్చు.

టెంపుర్‌ నెక్‌ పిల్లోస్‌: విస్కో ఎలాస్టిక్‌ ఫో మ్‌తో వీటిని తయారుచేస్తారు. ప్రెషర్‌ పాయిం ట్స్‌ వద్ద ఈ పిల్లో వేడి పెరగటం వల్ల నొప్పి నుంచి భుజాలు ఉపశమనాన్ని అందిస్తాయి.

లాటెక్స్‌ పిల్లోస్‌ : నేడు వినియోగిస్తోన్న అత్యంత ప్రాచుర్యం పొందిన పిల్లో్‌సలో ఇది ఒకటి. డౌన్‌ ఫీల్డ్‌, ఫెదర్‌ ఫీల్డ్‌ పిల్లో్‌సతో పోలిస్తే ఇది హెడ్‌, నెక్‌కి మంచి సపోర్ట్‌ ఇస్తుంది. నిద్రలో మీ తల కిందకి జారిపోకుండా ఇవి ఉంచుతాయి. లాటెక్స్‌ పిల్లోస్‌ వల్ల నెక్‌, షోల్డర్‌ స్ట్రెయిన్‌ కూడా తగ్గుతుంది.

పాలిస్టర్‌ పిల్లోస్‌ : మన ఇళ్లలో ఎక్కువ కనిపించే పిల్లోస్‌ ఇవి. ధర తక్కువగా ఉండే ఈ తలగడలు  సౌకర్యంగానూ ఉంటాయి.


పిల్లో ఎంచుకునేటప్పుడు ఏ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలంటే..

నిద్రపోయినప్పుడు తరచుగా మెలకువ రావడం, మెడ పట్టేయడం వంటి సమస్యలున్నవారు కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. వాటిలో ప్రధానంగా చూడాల్సింది ఆ తలగడలు మీకు అందించే మద్దతు. సరైన మద్దతు అందించకపోతే అది మీ నిద్రా భంగిమపై కూడా ప్రభావం చూపుతుంది. ఆ తరువాత చూడాల్సింది ఎత్తు. సైడ్‌ స్లీపర్స్‌కు తలగడ ఎత్తు తప్పనిసరిగా మంచానికి, వారి మెడకు నడుమ దూరాన్ని పూరించేలా ఉండాలి. ఒకవేళ మీరు పొట్టమీద పడుకునే వారైతే తలగడ ఎత్తు తక్కువగా ఉండాలి. మెటీరియల్స్‌ పరంగా చూస్తే మెమరీ ఫోమ్‌ పిల్లోస్‌ సౌకర్యం అందించడం తో పాటుగా మెడ నొప్పి నివారించేందుకు కూడా కొంత తోడ్పడతాయి. కాటన్‌ పిల్లోస్‌ వేడి, తేమ పీల్చుకుంటాయి.  

Updated Date - 2021-06-16T14:18:40+05:30 IST