స్నేహితుడికి బండి ఇస్తున్నారా..జర భద్రం

Jun 16 2021 @ 10:28AM

మైనర్లకు ఇస్తే మరింత ప్రమాదం 

ఇచ్చిన వారికే శిక్ష 

హైదరాబాద్‌ సిటీ: బాషా.. ప్రైవేట్‌ ఉద్యోగి. ఊరెళ్లి వస్తానంటే స్నేహితుడు రమే్‌షకు తన కారిచ్చాడు. మరో ఇద్దరు స్నేహితులతో కలిసి రమేష్‌ బయలుదేరాడు. కారును వారిలో ఓ మైనర్‌ నడుపుతున్నాడు. కారు అదుపు తప్పి యాక్సిడెంట్‌ అయింది. ఓ మహిళకు తీవ్ర గాయాలై మృతి చెందింది. నడిపేది మైనర్‌ కాబట్టి ఆ కారు ఓనర్‌కు శిక్ష పడుతుందని అందరూ భావించారు. కానీ పోలీసులు యజమాని నుంచి కారును తీసుకున్న రమే్‌షను అరెస్టు చేశారు. మైనర్‌ చేతికి బండి ఎవరు ఇచ్చారో వారికే శిక్షపడుతుందని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌కుమార్‌ స్పష్టం చేశారు. 


బండి ఎవరిచ్చారనేదే ముఖ్యం.. 

మైనర్లు డ్రైవింగ్‌, లైసెన్స్‌ లేకుండా వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడుతున్న కేసుల్లో చాలా మందికి అపోహలున్నాయి. పోలీసులు పూర్వాపరాలు పరిశీలించిన తర్వాతనే కేసులు నమోదు చేస్తారు. మైనర్‌ వాహనం నడుపుతూ పోలీసులకు దొరికినప్పుడు ఆ వాహన యజమాని ఎవరనేది ముఖ్యం కాదు. ఆ వాహనం మైనర్‌ చేతికి ఎవరిచ్చారనేది ముఖ్యం. ఒక వ్యక్తి లైసెన్స్‌ లేకుండా వాహనం నడిపి పోలీసులకు చిక్కినప్పుడు ఆ వాహన యజమాని నిందితుడు కాదు. ఎవరికైనా వాహనం ఇచ్చేటప్పుడు అతనికి లైసెన్స్‌ ఉందా, లేదా అనేది చూసుకోవాలి. 

- విజయ్‌ కుమార్‌, ట్రాఫిక్‌ డీసీపీ, సైబరాబాద్‌

Follow Us on: