కూకట్‌పల్లిలో జేసీ బ్రదర్స్‌ వస్త్ర షోరూమ్‌ ప్రారంభం

Sep 26 2021 @ 10:47AM

జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన సినీనటి కృతిశెట్టి 

పండుగలకు  ట్రెండీ షాపింగ్‌ డెస్టినేషన్‌..


హైదరాబాద్‌ సిటీ: కూకట్‌పల్లిలో ఏర్పాటు చేసిన ప్రముఖ వస్త్ర షోరూమ్‌ జేసీ బ్రదర్స్‌ షాపింగ్‌ మాల్‌ను ప్రముఖ సినీతార కృతిశెట్టి శనివారం జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కృతిశెట్టి మాట్లాడుతూ రాబోయే ఫెస్టివల్‌ సీజన్‌కు జేసీ బ్రదర్స్‌ షాపింగ్‌మాల్‌ ఒక ట్రెండీ షాపింగ్‌ డెస్టినేషన్‌ అవుతుందని అన్నారు. సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్స్‌ మర్రి జనార్దన్‌రెడ్డి, మర్రి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ 20 సంవత్సరాలుగా జంటనగర ప్రజలకు తక్కువ ధరలకే నాణ్యమైన వస్త్రాలు అందిస్తున్నామన్నారు. కూకట్‌పల్లి బ్రాంచ్‌ కస్టమర్‌లకు మరింత సౌకర్యవంతమైన సేవలందించాలనే ఉద్ధేశంతో పెద్ద ప్రాంగణంలోకి మార్చామన్నారు.

Follow Us on: