HYD: పరుపు మార్చండి.. కాలుష్యం తగ్గించండి

ABN , First Publish Date - 2021-09-18T17:01:17+05:30 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ సమయంలో ఇంట్లోనే ఎక్కువసేపు గడుపుతుండటం వల్ల సౌకర్యానికి అమిత ప్రాధాన్యం ఇవ్వడం పెరిగింది. పాత వస్తువులన్నీ రోతగానే కనిపిస్తున్నాయి.

HYD: పరుపు మార్చండి.. కాలుష్యం తగ్గించండి

హైదరాబాద్‌ సిటీ: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ సమయంలో ఇంట్లోనే ఎక్కువసేపు గడుపుతుండటం వల్ల సౌకర్యానికి అమిత ప్రాధాన్యం ఇవ్వడం పెరిగింది. పాత వస్తువులన్నీ రోతగానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బెడ్‌నే ఆఫీస్‌ డెస్క్‌గా మార్చుకున్న ఎంతోమంది ఈ పరుపులలోనూ టెక్నాలజీ అవకాశాలను చూస్తున్నారు. పాత పరుపులను వదిలించుకోవాలనుకుంటున్నారు. పరుపులను డస్ట్‌బిన్‌లలో పారేయకుండా వాటిని మార్చడం ద్వారా వాతావరణ కాలుష్యం తగ్గించడంతోపాటు పొదుపు కూడా చేసుకోవచ్చని చెబుతోంది ఇండియన్‌ స్లీప్‌ ప్రొడక్ట్స్‌ ఫెడరేషన్‌. ఇండియన్‌ పాలీయురేథిన్‌ అసోసియేషన్‌(ఐపీయూఏ), రీసైకల్‌తో కలిసి ఫెన్కోనహీ రీసైకల్‌ కరో శీర్షికన భారతదేశంలో మొట్టమొదటిసారిగా పరుపుల రీసైక్లింగ్‌ ప్రచారం ప్రారంభించింది. ఈ ప్రచారంలో భాగంగా పాత పరుపులను వినియోగదారుల ఇంటి వద్దకే వచ్చి సేకరిస్తారు. రీసైకల్‌ యాప్‌ లేదంటే వెబ్‌సైట్‌పై అభ్యర్థించడం లేదా కాల్‌ చేసి సేవలను పొందొచ్చు. పాత పరుపులను అందజేసిన వినియోగదారులకు ప్రత్యేకంగా కూపన్లు అందజేస్తారు. వీటిని నూతన పరుపుల కొనుగోలు సమయంలో మార్చుకోవచ్చు. దీంతో చెత్తకుండీలలో చేరుతున్న పరుపులు వెదజల్లే కాలుష్యం తగ్గించడం లక్ష్యంగా చేసుకున్నామని ఐపీ యూఏ-ఐఎ్‌సపీఎఫ్‌ స్టీరింగ్‌ కమిటీ సభ్యుడు సిద్ధార్థ మలానీ పేర్కొన్నారు. 

Updated Date - 2021-09-18T17:01:17+05:30 IST