షవర్‌ కింద నిమజ్జనం..బాచుపల్లిలో సరికొత్త ప్రయోగం

Sep 20 2021 @ 11:52AM

హైదరాబాద్‌ సిటీ: నగర శివారులోని ఓ కాలనీ సరికొత్త ప్రయోగానికి తెరలేపింది. మట్టి వినాయకుడి ప్రతిష్టించడంతో పాటు నీటి కుంటలోనే కరిగిపోయేలా చర్యలు చేపట్టింది. బాచుపల్లిలోని హరితవనం కాలనీవాసులు పదేళ్లుగా నవరాత్రి వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది 8.5 ఫీట్ల విగ్రహాన్ని ప్రతిష్టించారు. విగ్రహ నిమజ్జనం కోసం రూ.50 వేలతో ప్రత్యేక స్టాండ్‌ ఏర్పాటు చేసి దానిపైన మోటార్‌ సాయంతో షవర్‌ను బిగించారు. ఊరేగింపు అనంతరం ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటలకు షవర్‌ కింద ప్రారంభమైన నిమజ్జనం ఉదయం 7.30కు పూర్తయింది. పర్యావరణ పరిరక్షణకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని నిజాంపేట్‌ కార్పొరేటర్‌ విజయలక్ష్మి తెలిపారు.

Follow Us on:

హైదరాబాద్మరిన్ని...