HYD: మహిళలను వేధిస్తున్న సైబర్‌ నేరస్థుడి అరెస్టు

ABN , First Publish Date - 2021-12-01T14:04:55+05:30 IST

వాట్సాప్‌ వీడియోకాల్స్‌ చేసి మహిళలను వేధిస్తున్న సైబర్‌ నేరస్థుడి ఆటకట్టించారు రాచకొండ పోలీసులు. నల్గొండ జిల్లా పానగల్‌కు చెందిన గట్టాడి దీపక్‌ కూలిపనులు చేస్తుంటాడు.

HYD: మహిళలను వేధిస్తున్న సైబర్‌ నేరస్థుడి అరెస్టు

హైదరాబాద్‌ సిటీ: వాట్సాప్‌ వీడియోకాల్స్‌ చేసి మహిళలను వేధిస్తున్న సైబర్‌ నేరస్థుడి ఆటకట్టించారు రాచకొండ పోలీసులు. నల్గొండ జిల్లా పానగల్‌కు చెందిన గట్టాడి దీపక్‌ కూలిపనులు చేస్తుంటాడు. స్మార్ట్‌ఫోన్‌లో అశ్లీల వీడియోలు చూడటానికి అలవాటుపడిన దీపక్‌ మహిళలకు వీడియోకాల్స్‌ చేసి వారితో మాట్లాడాలని భావించేవాడు. ఈ క్రమంలో గుర్తుతెలియని నంబర్స్‌కు వీడియోకాల్స్‌ చేసేవాడు. అవతలి వైపు మగవారు ఫోన్‌ తీస్తే కట్‌ చేసేవాడు. అలా కాకుండా మహిళలు ఫోన్‌ తీస్తే వారితో అసభ్యంగా మాట్లాడుతూ ముఖం కనిపించకుండా జాగ్రత్త పడేవాడు. ఏప్రిల్‌ నుంచి ఓ మహిళకు ఇలాంటి వీడియోకాల్స్‌ వస్తుండటంతో పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు టెక్నికల్‌ ఎవిడెన్స్‌ ద్వారా నిందితున్ని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

Updated Date - 2021-12-01T14:04:55+05:30 IST