హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్‌ ఇంట విషాదం

ABN , First Publish Date - 2021-05-11T15:07:08+05:30 IST

పార్థీవదేహన్ని సందర్శించి నివాళులర్పించారు.

హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్‌ ఇంట విషాదం

హైదరాబాద్/సైదాబాద్‌ : నగర మాజీ డిప్యూటీ మేయర్‌ సుభాష్‌ చందర్జీ సోదరుడు జగదీశ్‌ చందర్జీ(72) గుండెపోటుతో  ఆదివారం రాత్రి సైదాబాద్‌ పూసలబస్తీలోని నివాసంలో మృతి చెందారు. జగదీశ్‌చందర్జీ హెచ్‌ఎంటీలో బీఎంఎస్‌ కార్మిక సంఘం నేతగా పనిచేశారు. పలువురు బీజేపీ, బీఎంఎస్‌ నేతలు జగదీశ్‌ పార్థీవదేహన్ని సందర్శించి నివాళులర్పించారు. అంత్యక్రియలు సోమవారం మధ్యాహ్నం సైదాబాద్‌ శ్మశానవాటికలో నిర్వహించారు.

Updated Date - 2021-05-11T15:07:08+05:30 IST