మయూరి ఆర్ట్స్ దేశానికే ఆదర్శం : డాక్టర్ ఆనంద్

ABN , First Publish Date - 2020-11-29T17:09:57+05:30 IST

నగరానికి చెందిన మయూరి ఆర్ట్స్ పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. గత 30 ఏళ్లుగా వేల నాట్య ప్రదర్శనలను, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఈ సంస్థ..

మయూరి ఆర్ట్స్ దేశానికే ఆదర్శం : డాక్టర్ ఆనంద్

హైదరాబాద్: నగరానికి చెందిన మయూరి ఆర్ట్స్ పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. గత 30 ఏళ్లుగా వేల నాట్య ప్రదర్శనలను, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఈ సంస్థ.. చిన్నారుల ప్రతిభను వెలికితీయడానికి విశేషంగా కృషి చేస్తోంది. సుందరయ్య కళాభవన్‌లో శనివారం బాల ప్రతిభా అవార్డ్స్, లెజెండరీ అవార్డ్స్‌ ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించింది. మయూరి ఆర్ట్స్ రాధ, సాయి ప్రియ, దత్తు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ వైద్యులు, డైరెక్టర్, సామాజిక కార్య కర్త డాక్టర్ ఆనంద్ ముఖ్య అతిధిగా విచ్చేశారు. నిర్మాత యన్.యస్. నాయక్, సంజు, సుమిత్, రామడుగు వసంత్ తదితరులు ప్రత్యేక అతిధులుగా హాజరయ్యారు. చిన్నారులకు అవార్డులను అందజేసిన అనంతరం డాక్టర్ ఆనంద్ మాట్లాడుతూ.. మయూరి ఆర్ట్స్ దేశానికే ఆదర్శమన్నారు. చిన్నారుల ప్రతిభకు పట్టం కడుతున్న సంస్థ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో చిన్నారుల నృత్య ప్రదర్శన అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. 



Updated Date - 2020-11-29T17:09:57+05:30 IST