Hyderabad: జీడిమెట్లలో పేలిన గ్యాస్ సిలిండర్.. ఇద్దరు మృతి
ABN , First Publish Date - 2022-07-27T03:54:43+05:30 IST
జీడిమెట్ల రాంరెడ్డినగర్లోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ (Gas Cylinder) పేలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. జార్కండ్ (jharkhand)కు...
హైదరాబాద్ (Hyderabad): జీడిమెట్ల రాంరెడ్డినగర్లోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ (Gas Cylinder) పేలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. జార్కండ్ (jharkhand)కు చెందిన 8 మంది బ్యాచిలర్స్ నివాసముంటున్నారు. ఉదయం నుంచి ఆ ఇంట్లో గొడవ జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. సిలిండర్ బ్లాస్ట్ (Blast) చేసి చంపి మిగతా వారు పరారయ్యినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. హత్య, సూసైడ్, ప్రమాదం పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. .