విన్యాసాలు అదుర్స్‌..!

ABN , First Publish Date - 2021-11-07T15:52:38+05:30 IST

సదర్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. శనివారం రాత్రి ప్రారంభమైన వేడుకలు ఉదయం నాలుగు గంటల వరకు కొనసాగాయి. అందంగా ముస్తాబైన దున్నలను విద్యుత్‌దీపాలు

విన్యాసాలు అదుర్స్‌..!

హైదరాబాద్/హిమాయత్‌నగర్‌: సదర్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. శనివారం రాత్రి ప్రారంభమైన వేడుకలు  ఉదయం నాలుగు గంటల వరకు కొనసాగాయి. అందంగా ముస్తాబైన దున్నలను విద్యుత్‌దీపాలు, పూలదండలతో అలంకరించిన శకటాలపై రాచఠీవీని ఒలకబోస్తూ బ్యాండ్‌ మేళాల ఊరేగింపుతో నారాయణగూడ వైఎంసీఏ ప్రధాన వేదికకు తీసుకువచ్చారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయం ప్రకారం సలేంద్రి చౌదరి మల్లయ్య యాదవ్‌ కుటుంబసభ్యులు దున్నలకు అమ్మవారి ఆశీర్వచనాలు అందజేశారు. 


ఈ సందర్భంగా కొందరు దున్నలతో చేయించిన విన్యాసాలు అదుర్స్‌ అనిపించాయి.  టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ తదితర పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు వేడుకలలో పాల్గొన్నారు. ఆయా పార్టీల నేతలు ప్రత్యేక వేదికలు ఏర్పాటుచేసి ఆధిపత్యాన్ని చాటుకునే ప్రయత్నం చేశారు. సెంట్రల్‌జోన్‌ జాయింట్‌ సీపీ, ఈస్ట్‌జోన్‌ డీసీపీలు భద్రతను పర్యవేక్షించారు. ఆబిడ్స్‌ ఏసీపీ, సెంట్రల్‌జోన్‌ పరిధిలోని సీఐలు బందోబస్తులో పాల్గొన్నారు.  


దున్నకు 3కిలోల బంగారు గొలుసు 

చప్పల్‌ బజార్‌లో సదర్‌ ఉత్సవాల కోసం తీసుకొచ్చిన ఓ దున్నకు లడ్డూయాదవ్‌ మూడు కిలోల బంగారు గొలుసు చేయించి అలంకరించారు. హరియాణా నుంచి ఈ దున్నను తీసుకురాగా, దాని యజమాని డబ్బులు తీసుకోలేదు. దీంతో బంగారు గొలుసు చేయించారు.

Updated Date - 2021-11-07T15:52:38+05:30 IST