హైదరాబాద్‌‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం

ABN , First Publish Date - 2022-07-05T03:55:14+05:30 IST

భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం (Huge Rain) కురిసింది. ఓయూ, తార్నాక, ఉప్పల్, బోడుప్పల్‌...

హైదరాబాద్‌‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం

హైదరాబాద్‌ (Hyderabad): భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం (Huge Rain) కురిసింది. ఓయూ, తార్నాక, ఉప్పల్, బోడుప్పల్‌,  నాగోల్, కొత్తపేట, చైతన్యపురి, సరూర్‌నగర్, కర్మాన్‌ఘాట్, చంపాపేట, సంతోష్‌నగర్, సైదాబాద్, మలక్‌పేట, కాప్రా, సికింద్రాబాద్, రాజేంద్రనగర్‌,  రామంతాపూర్‌లో వర్షం కురిసింది. ఇప్పటివరకు 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది.  అంబర్‌పేట్‌లో 2 సెం.మీ. వర్షపాతం నమోదు అయింది. ఈ వర్షంతో పలు చోట్ల ట్రాఫిక్ భారీగా స్తంభించింది.  వర్షం దృష్ట్యా అటు జీహెచ్ఎంసీ (GHMC) అప్రమత్తమైంది. డీఆర్ఎఫ్, విపత్తు సహాయక బృందాలను అలర్ట్ చేసింది. 

Updated Date - 2022-07-05T03:55:14+05:30 IST