హైదరాబాద్‌లో హడలెత్తిస్తున్న కిలాడీ లేడీ గ్యాంగ్‌లు

ABN , First Publish Date - 2021-12-16T00:26:44+05:30 IST

అవసరం మీది.. డబ్బు తమది అంటూ నమ్మబలుకుతుంది. వడ్డీ ఎంతైనా పర్వాలేదని చెబితే చాలు ఎన్ని కోట్లయినా...

హైదరాబాద్‌లో హడలెత్తిస్తున్న కిలాడీ లేడీ గ్యాంగ్‌లు

హైదరాబాద్: అవసరం మీది.. డబ్బు తమది అంటూ నమ్మబలుకుతుంది. వడ్డీ ఎంతైనా పర్వాలేదని చెబితే చాలు ఎన్ని కోట్లయినా క్షణాల్లో మీ ముందుంటాయి. అయితే వడ్డీ మాత్రం యాభై శాతం. నెల తిరగకముండే వడ్డీతో సహా లెక్క ముట్ట చెప్పాలి. కాదంటే ఖతమైపోవాల్సిందే. హైదరాబాద్‌లో హడలెత్తిస్తున్న నరహంతక ముఠాపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి స్టింగ్ ఆపరేషన్ చేసింది. 


ధనం మూలం, ఇదం జగత్ అంటారు పెద్దలు. డబ్బు ఎవరికి మాత్రం అవసరం ఉండదు. వ్యక్తిగత అవసరం కోసమో వ్యాపార అవసరాల కోసమో మనం ఎవరో ఒకరి వద్ద చేయి చాపుతూ ఉంటాం. మన అవసరాలను గుర్తించి మనకు డబ్బు ఇచ్చే సంస్థలు కోకల్లలు ఉన్నాయి. వాటిల్లో తనఖా ఉంటే తప్ప క్యాష్ ఇచ్చే పరిస్థితి ఉండదు. ఈ మధ్య కాలంలో కొన్ని సంస్థలు తనఖా లేకుండా సులభతర రుణాలు ఇస్తున్నా అవి వ్యాపార అవసరాలకోసం అవసరమయ్యేంత మొత్తం ఇవ్వలేకపోతున్నాయి. ఇలాంటి సందర్భంలో అవసరార్ధులు డబ్బు కోసం బ్రోకర్లను ఆశ్రయిస్తున్నారు. ఆ బ్రోకర్లు నగరంలో ఖతర్నాక్ కన్నింగ్ గ్యాంగ్‌తో అప్పు ఇస్తున్నారు. ఆ గ్యాంగ్ అడిగిన అరగంటలో కోట్లలో డబ్బు సమకూర్చుతుంది. ఇంతదాక బాగున్నా అప్పు తీర్చడం ఆలస్యమైతే ఆ ముఠా పెట్టే టార్చర్ మామూలుగా ఉండదు. 



Updated Date - 2021-12-16T00:26:44+05:30 IST