HYD: లడ్డూ.. అ‘ధర’హో..!

Sep 21 2021 @ 11:49AM

వేలం పాటల జోరు.. 

కలశానికి, కరెన్సీ దండకూ డిమాండ్‌


హైదరాబాద్/ఎల్‌బీనగర్‌:  వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆయన చేతిలోని లడ్డూను దక్కించుకునేందుకు పలువురు ఆసక్తి చూపారు. ఆదివారం జరిగిన లడ్డూ వేలం పాటలు నిర్వహించగా, అదిరే ధరతో వాటిని కైవసం చేసుకున్నారు. 

లింగోజిగూడ డివిజన్‌ పరిధిలోని మాధవరం సెరినిటీ గణేష్‌ ఉత్సవ సమితి ఆధ్వర్యంలోని గణపతి లడ్డూను రూ. 6 లక్షలకు తేనేటి భాస్కర్‌రెడ్డి కైవసం చేసుకున్నారు. కలశాన్ని రూ. 25 వేలకు రాజశేఖర్‌రెడ్డి, కరెన్సీ దండను రూ. 1,05,000 లకు వినీష్‌, వస్ర్తాన్ని రూ. 15,000లకు వినయ్‌ దక్కించుకున్నారు. కమిటీ ప్రతినిధులు రవీంద్ర, రాజశేఖర్‌రెడ్డి, దూసరి రాజు, ఆలంపల్లి రమేష్‌, సత్తయ్యగౌడ్‌, గట్టుపల్లి శ్రీనివాస, సాయినంద, తూడ శ్రీనివాసరెడ్డి నగేష్‌, సురేష్‌, విజయ్‌సాగర్‌, అనిరుద్‌, మావరం సెరినిటీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

ఆర్‌కేపురం చిత్రాలేఅవుట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన వినాయకుడి లడ్డూ వేలం పాటలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు దేప భాస్కర్‌రెడ్డి సోదరి పిట్టా సుమతి హరినాథ్‌రెడ్డి రూ. 2, 25,000లకు దక్కించుకున్నారు. 


నాదర్‌గుల్‌లో రూ. 5 లక్షలు 

సరూర్‌నగర్‌: బాలాపూర్‌ మండలం నాదర్‌గుల్‌లో వివేకానంద యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో వినాయకుడి లడ్డూ వేలం వేయగా, బీజేపీ బడంగ్‌పేట్‌ పట్టణ శాఖ అధ్యక్షుడు చెరుకుపల్లి వెంకట్‌రెడ్డి రూ.5 లక్షలకు కైవసం చేసుకున్నారు. బాలాపూర్‌ వినాయకుడి శాలువాను వేలం వేయగా ఏనుగు రాంరెడ్డి రూ.2.45లక్షలకు సొంతం చేసుకున్నారు. 

మీర్‌పేట్‌ నందిహిల్స్‌లోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో లడ్డూను ఆలయ కమిటీ ప్రతినిధి పి.విజయ్‌కుమార్‌-రేవతి దంపతులు సొంతం చేసుకున్నారు.

 మీర్‌పేట్‌ 38వ డివిజన్‌లోని సీతాహోమ్స్‌లోని లంబోదరుడి చేతిలోని లడ్డూను కార్పొరేటర్‌ జిల్లెల అరుణాప్రభాకర్‌రెడ్డి రూ.33వేలకు దక్కించుకున్నారు.

 మీర్‌పేట్‌ సీతాహోమ్స్‌ ఫేజ్‌-2 కాలనీలోని మాజిస్టిక్‌ అపార్ట్‌మెంట్‌ విఘ్నేశ్వరుడి లడ్డూ ప్రసాదాన్ని రూ.30 వేలకు యాదగిరి, సాయికుమార్‌ సొంతం చేసుకున్నారు.

మీర్‌పేట్‌ లక్ష్మీనగర్‌లోని గణనాథుడి చేతిలోని పెద్ద లడ్డూను రూ.51,116కు గర్దాస్‌ శ్రీనివా్‌సనేత దక్కించుకోగా, చిన్న లడ్డూను రూ.20,116కు సైదులునాయక్‌ సొంతం చేసుకున్నారు.

 మీర్‌పేట్‌ శివసాయినగర్‌ కాలనీలోని శ్రీలక్ష్మీగణపతి దేవాలయం  వద్ద ప్రతిష్టించిన వినాయకుడి లడ్డూను నారిన బలరామకృష్ణ రూ.55 వేలకు దక్కించుకోగా, ఇక్కడి కమ్యూనిటీ హాల్‌ వద్ద పూజలందుకున్న గణేశుడి లడ్డూను రూ.75,100కు శరత్‌ కైవసం చేసుకున్నారు. 


వెంకటేశ్వరకాలనీ ఫేజ్‌-1లో రూ. 3.01 లక్షలు

చంపాపేట: హస్తినాపురం డివిజన్‌ వెంకటేశ్వరకాలనీ ఫేజ్‌-1లో కాలనీ సంక్షేమ సంఘం వారు కమ్యూనిటీహాల్‌లో ప్రతిష్టించిన వినాయకుడి లడ్డూ వేలంలో బూరం అరుణ్‌కుమార్‌ రూ.3.01 లక్షలకు సొంతం చేసుకున్నారు. స్వామి వారి కలశంను వడ్డనపు రాంబాబు 46 వేలకు, హుండీని కాల్వ నర్సింహా 40 వేలకు, స్వామి వారి పంచె, శాలువాను మునగాల చంద్రశేఖర్‌రెడ్డి రూ. 16,116కు దక్కించుకున్నారు.   

మన్సూరాబాద్‌: నాగోలు డివిజన్‌ ద్వారకానగర్‌ కాలనీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎకో ఫ్రెండ్లీ వినాయకుడి వద్ద లడ్డూను రూ.99 వేలకు నాగయ్యగౌడ్‌ వేలం పాటలో దక్కించుకున్నారు. అసోసియేషన్‌ అధ్యక్షుడు దాసోజు అరుణ్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శి ప్రశాంత్‌నాయుడు పాల్గొన్నారు. 

మన్సూరాబాద్‌ డివిజన్‌ శ్రీబాలాజీనగర్‌ కాలనీ సంక్షేమ సంఘ గణనాథుడి వద్ద లడ్డూను రూ.55 వేలకు కె.మధుసూదన్‌రెడ్డి వేలం పాటలో దక్కించుకున్నారు. కాలనీ అధ్యక్షుడు జి.మోహన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎ.శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

కుర్మగూడ డివిజన్‌ పూలతోట స్ధరార్‌ పటేల్‌ యూత్‌ అసోసియేషన్‌ లడ్డును రూ. 1.72 లక్షలకు బాబురావు, మల్లిక దంపతులు  కైవసం చేసుకున్నారు.

హయత్‌నగర్‌: మన్సూరాబాద్‌ డివిజన్‌లోని కొలన్‌ శివారెడ్డి కాలనీలో కాలనీ సంక్షేమ సంఘ వినాయకుడి లడ్డూను యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకుడు భీమిడి కృష్ణారెడ్డి రూ. 51,999లకు సొంతం చేసుకున్నారు.  కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కొలన్‌ నరేందర్‌రెడ్డి, నంద గోపాల్‌రెడ్డి, వెంకన్న, కొండల్‌రెడ్డి, చంద్రయ్య శ్రీనివా్‌సరెడ్డిలు పాల్గొన్నారు. 


మర్చంట్‌ లడ్డూ బికేష్‌ గోయల్‌కు.. 

చాదర్‌ఘాట్‌: మలక్‌పే శ్రీకృపా మార్కెట్‌ హోల్‌సేల్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన వినాయకుడి లడ్డూను వ్యాపారి బికేష్‌ గోయల్‌ రూ.1.69 లక్షలకు కైవసం చేసుకున్నారని అధ్యక్షుడు చిక్కా చంద్రమోహన్‌కుమార్‌ తెలిపారు.  ఓల్డ్‌మలక్‌పేటలో శ్రీవినాయక ఫ్రెండ్స్‌ అసోసియేషన్‌ గణనాధుని లడ్డూను సి.విక్రమ్‌ రూ.1.05 లక్షలకు కైవసం చేసుకున్నారని అసోసియేషన్‌ అద్యక్షుడు పీటీ శంకర్‌ ముదిరాజ్‌ తెలిపారు. ఓల్డ్‌మలక్‌పేటలో ఆల్‌ గణేశ్‌ ఫ్రెండ్స్‌ అసోసియేషన్‌ గణనాధున్ని లడ్డూను బుగుడాల శ్రీకాంత్‌ రూ.34 వేలకు చేజిక్కించుకున్నారని ప్రతినిధి బాబు శ్రీనివాస్‌ వెల్లడించారు. ఓల్డ్‌మలక్‌పేట శంకర్‌నగర్‌లో ఫ్రెండ్స్‌  వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కొలువుదీరిన వినాయకుడి లడ్డూను చాడా శ్రీకాంత్‌ రూ.73వేలకు కైవసం చేసుకున్నారని అసోసియేషన్‌ అధ్యక్షుడు పగిళ్ల నర్సింగ్‌ ప్రకటించారు. ఓల్డ్‌మలక్‌పేట సాయి గణేశ్‌ భవన్‌లో ప్రతిష్టించిన గణనాధుని లడ్డూను జాన్‌ రూ.లక్షకు దక్కించుకున్నారని అసోసియేషన్‌ సలహాదారుడు చౌకి రవికుమార్‌ వెల్లడించారు.

Follow Us on:

హైదరాబాద్మరిన్ని...