ఎస్‌యువీ గ్రాండ్ విటారాను ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

ABN , First Publish Date - 2022-08-11T03:48:48+05:30 IST

హైదరాబాద్‌లో వాహనాల వల్ల పర్యావరణం కాలుష్యం అవుతుంతోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మారుతి సుజుకీ...

ఎస్‌యువీ గ్రాండ్ విటారాను ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్: హైదరాబాద్‌లో వాహనాల వల్ల పర్యావరణం కాలుష్యం అవుతుంతోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మారుతి సుజుకీ పవన్ మోటర్స్‌లో గ్రాండ్ విటారా కారును ఆయన  ప్రారంచారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ వాహన కాలుష్యం వల్ల చాలా జబ్బులు వ్యాపిస్తున్నాయని చెప్పారు. అలాగే ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఇంజన్ ఆపకపోవడం వల్ల పెట్రోల్, డీజిల్ కూడా వృదా అవుతుందన్నారు. కానీ సరికొత్త టెక్నాలజీతో తయారైన మారుతి సుజికీ కారు సిగ్నల్‌ వద్ద ఆటోమ్యాటిక్‌గా ఇంజన్ ఆఫ్ అయిపోతుందని పేర్కొన్నారు.


గ్రాండ్ విటారా ట్రెండ్ సెట్టింగ్ వర్చువల్ అనుభూతిని అందిస్తుందని.. ఇప్పటికే 300లకు పైగా బుకింగ్స్ అయ్యాయని పవన్ మోటర్స్  బిజినెస్ హెడ్ రవి రెడ్డి  తెలిపారు. ఈ మారుతి సుజుకీ గ్రాండ్ విటారా  ఎస్ యు వీ సెగ్మెంట్ ప్రపంచ స్థాయి ప్రమాణాలు కలిగి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో పాటు.. పవన్ మోటార్స్ గ్రూప్ ఛైర్మన్ కోమటిరెడ్డి మోహన్ రెడ్డి, ఉప్పల్ ఆర్‌టి‌ఏ రవి కుమార్, ఎండి కె చంద్ర పవన్ రెడ్డి, రీజినల్ మేనేజర్ అమిత్ కుమార్, పవన్ మోటార్స్ మరియు నెక్సా షో రూమ్ మేనేజర్ వినోద్ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-11T03:48:48+05:30 IST