Hyderabad: మరో 2 గంటల్లో భారీ వర్ష సూచన..

ABN , First Publish Date - 2022-05-04T19:24:28+05:30 IST

హైదరాబాద్‌లో రెండు గంటలపాటు కురిసిన భారీ వర్షానికి పెద్ద పెద్ద చెట్లు రోడ్డుపై కూలిపోయాయి.

Hyderabad: మరో 2 గంటల్లో భారీ వర్ష సూచన..

Hyderabad: నగరంలో రెండు గంటలపాటు కురిసిన భారీ వర్షానికి పెద్ద పెద్ద చెట్లు రోడ్డుపై కూలిపోయాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అప్రమత్తమైన జీహెచ్ఎంసీ సిబ్బంది చెట్లను తొలగిస్తున్నారు. మరో రెండు గంటల్లో భారీ వర్ష సూచన ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. 


నగరంలో కుండపోత వర్షం కురిసింది. బుధవారం తెల్లవారుజాము నుంచి ఒక్కసారిగా ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగుతున్నాయి. వర్ష బీభత్సానికి విద్యుత్ సరఫరా ఎక్కడికక్కడ నిలిచిపోయింది. రంగంలోకి జీహెచ్‌ఎంసీ డిజాస్టర్‌, డీఆర్‌ఎఫ్‌ బృందాలు రోడ్లపై నిలిచిన నీటిని తొలగిస్తున్నారు. వర్షానికి చార్మినార్‌, మలక్‌పేట్‌, బహదూర్‌పురా, చాదర్‌ఘాట్‌లో హోర్డింగ్స్‌ కూలిపోయాయి. కుండపోత వర్షానికి పలు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, రోడ్లపై మోకాళ్ల లోతు నీరు వచ్చి చేరింది. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి.

Read more