Hyd: కారులో బాలిక వీడియోలు వైరల్‌పై Policeల నిఘా

ABN , First Publish Date - 2022-06-06T20:57:33+05:30 IST

జూబ్లీహిల్స్ మైనర్ బాలిక అత్యాచారం కేసులో పోలీసుల విచారణ వేగవంతమైంది.

Hyd: కారులో బాలిక వీడియోలు వైరల్‌పై Policeల నిఘా

Hyderabad: జూబ్లీహిల్స్ (Jubileehills) మైనర్ బాలిక అత్యాచారం కేసులో పోలీసుల (Police) విచారణ వేగవంతమైంది. ఇప్పటికే నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మరో మైనర్ కోసం గాలిస్తున్నారు. ఈ కేసులో నిందితుడిగా భావిస్తున్న ఎమ్మెల్యే కుమారుడు విదేశాలకు వెళ్లిపోయినట్లు అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తు సరిగ్గా జరగకపోతే కోర్టును ఆశ్రయిస్తామని బీజేపీ నేతలు అంటున్నారు.


ఈ కేసుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలు ఎవరు సోషల్ మీడియాలో పెడుతున్నారో వారిపై కూడా పోలీసులు నిఘా పెట్టారు. ఈ కేసులో కీలకంగా భావిస్తున్న ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడు పేరును తప్పించారన్న ఆరోపణలపై ఇవాళ పోలీసులు కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఎమ్మెల్యే కుమారుడిని ఏ6 నిందితుడిగా చేర్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి ఎమ్మెల్యే రఘునందన్ రావు విడుదల చేసిన ఫోటోలు, వీడియోలపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. దీనిపై రఘునందన్ రావుకు కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. ఈ ఫోటోలు, వీడియోలు ఎమ్మెల్యేకు ఏ విధంగా లభించాయో అన్నదానిపై పోలీసులు విచారించనున్నారు.

Updated Date - 2022-06-06T20:57:33+05:30 IST