Hyd: Amnesia పబ్ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు

ABN , First Publish Date - 2022-06-07T17:02:37+05:30 IST

అమ్నీషియా పబ్ (Amnesia Pub) ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

Hyd: Amnesia పబ్ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు

Hyderabad: అమ్నీషియా పబ్ (Amnesia Pub) ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ (Jubileehills) పరిధిలోని అన్ని పబ్‌లలో సోదాలు నిర్వహించారు. నిబంధనలను అతిక్రమిస్తూ మైనర్లను పబ్‌ల్లోకి అనుమతిస్తున్నారని ఆరోపణలు ఉన్న పబ్‌లలో తనిఖీలు చేశారు. అనుమానం వచ్చిన వారి ఆధార్ కార్డులు కూడా చెక్ చేశారు. కొన్ని పబ్‌లలో మైనర్లను అనుమతిస్తున్నారు. మరోవైపు డీజే, అశ్లీల నృత్యాలతో పబ్ నిర్వాహకులు మైనర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు బృందాలుగా విడిపోయి జూబ్లీహిల్స్ పరిధిలో ఉన్న అన్ని పబ్‌లలో తనిఖీలు నిర్వహించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, మహిళలను పబ్‌లకు అనుమతించకుండా చర్యలు తీసుకుంటున్నారు.

Updated Date - 2022-06-07T17:02:37+05:30 IST