Telanganaలో పుస్తకాలు, యూనిఫాంలు లేకుండానే ప్రారంభమైన Schools

ABN , First Publish Date - 2022-06-14T16:40:36+05:30 IST

తెలంగాణ (Telangana)లో సోమవారం నుంచి ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమయ్యాయి.

Telanganaలో పుస్తకాలు, యూనిఫాంలు లేకుండానే ప్రారంభమైన Schools

Hyderabad: తెలంగాణ (Telangana)లో సోమవారం నుంచి ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమయ్యాయి. కొత్త పుస్తకాలు, యూనిఫాంలు లేకుండానే విద్యార్థులు పాఠశాలలకు (Schools) వెళ్లారు. కొత్త పాఠ్యపుస్తకాలు, యూనిఫాంల కోసం విద్యార్థులు  నెల రోజుల పాటు వేచి చూసే పరిస్థితి కనిపిస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం (TRS Govt.) పుస్తకాలు అందించడంలో మీనమేషాలు లెక్కించడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.


పుస్తకాల ముద్రణ, యూనిఫాంలకు ఆదేశాలివ్వడంలో ప్రభుత్వం జాప్యం చేసింది. దీంతో ఖాళీ బ్యాగులు, పాత యూనిఫాంతోనే విద్యార్థులు పాఠశాలలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొత్త పుస్తకాలు వచ్చే దాకా పాత పుస్తకాలతోనే విద్యార్థుల చదువు కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు. కింది తరగతి సబ్జెక్టులనే మరోసారి రివిజన్‌ చేయించనున్నారు.  రాష్ట్రంలో ఈ ఏడాది నుంచి ఆంగ్ల మాధ్యమం కూడా ప్రారంభించారు. సుమారు 26 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు అందించాల్సి ఉంది. 


Updated Date - 2022-06-14T16:40:36+05:30 IST