ఆవుల Subbaraoకు 14 రోజుల Remand విధించిన Railway Court

ABN , First Publish Date - 2022-06-25T21:51:58+05:30 IST

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్ల కేసులో ఏ1 నిందితుడు ఆవుల సుబ్బారావుకు కోర్టు రిమాండ్ విధించింది.

ఆవుల Subbaraoకు 14 రోజుల Remand విధించిన Railway Court

Hyderabad: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (Railway Station) అల్లర్ల కేసులో ఏ1 నిందితుడు ఆవుల సుబ్బారావు (Subbarao)కు రైల్వే కోర్టు (Railway Court) రిమాండ్ విధించింది. సుబ్బారావుతో సహ మరో ముగ్గురు (మల్లారెడ్డి, శివ, బీసీ రెడ్డి)ని రైల్వే పోలీసులు శనివారం కోర్టులో హాజరు పరిచారు. నిందితులకు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ (Remand) విధించారు. అంతకుముందు అల్లర్లకు సంబంధించి 56 మంది ఆందోళనకారులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నవారి సంఖ్య 60కి చేరింది. సుబ్బారావు పాత్ర గురించి రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలకమైన అంశాలను ప్రస్తావించారు.


సికింద్రాబాద్ రైల్వే విధ్వంసం కేసులో అరెస్ట్ అయిన ఆవుల సుబ్బారావు రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆవుల సుబ్బారావు 2011లో ఆర్మీలో పనిచేశాడని, ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌ అతడికి బాగా తెలుసునని పోలీసులు తెలిపారు. 2014లో సాయి డిఫెన్స్‌ అకాడమి ప్రారంభించిన సుబ్బారావు, ఆర్మీలో సెలెక్ట్‌ అయిన తర్వాత ఉద్యోగుల దగ్గర రూ.3 లక్షలు వసూలు చేస్తున్నాడని, అభ్యర్థుల టెన్త్ సర్టిఫికెట్లు పెట్టుకుని ఉద్యోగం వచ్చిన తర్వాత సర్టిఫికెట్లు ఇస్తున్నాడని అన్నారు. 2019 ఆర్మీ అభ్యర్థులను రెచ్చగొట్టాడని, ఏఆర్‌వో ఆఫీస్‌ దగ్గర ధర్నాకు ప్లాన్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. రైల్వేస్టేషన్‌ బ్లాక్‌, ఇండియన్‌ ఆర్మీ, హకీంపేట ఆర్మీ సోల్జర్‌ గ్రూప్‌, చలో సికింద్రాబాద్‌ ఏఆర్‌వో గ్రూప్‌, ఆర్మీ జీడీ 2021 మార్చ్‌ ర్యాలీ, సీఈఈ సోల్జర్‌ గ్రూప్‌, సోల్జర్స్‌ టు డై పేరిట గ్రూపులు పెట్టాడని, బీహార్‌లో జరిగినట్టుగానే రైళ్లను తగలబెట్టాలని సూచించాడన్నారు. సుబ్బారావు తరపున అతడి అనుచరుడు శివ నిత్యం అభ్యర్ధులతో టచ్‌లో ఉంటున్నాడని, శివ ఆదేశాల మేరకే సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో విధ్వంసం జరిగినట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. 

Updated Date - 2022-06-25T21:51:58+05:30 IST