
హైదరాబాద్ (Hyderabad): మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabita Indra Reddy)పై మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి (Krishna Reddy) ఫైర్ (Fire) అయ్యారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియతో మాట్లాడుతూ సబితా ఇంద్రారెడ్డి, ఆమె అనుచరులు చెరువులు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. చెరువుల్లో కమర్షియల్ కాంప్లెక్స్ ఎలా కడతారని ప్రశ్నించారు. తాను పుట్టి పెరిగిన ప్రాంతంలో చెరువులు కబ్జా అవుతుంటే చూస్తూ ఊరుకోనన్నారు. మంత్రితో వచ్చిన నేతలు పార్టీ మారుతుంటే ఏం చేస్తున్నారని నిలదీశారు. పార్టీని కాపాడాల్సిన బాధ్యత లేదా? అన్నారు. సీఎం కేసీఆర్ పిలిచి మాట్లాడతారని ఆశిస్తున్నానన్నారు. తానేమీ చిన్న మనిషిని కాదని, మేయర్, ఎమ్మెల్యేగా అన్ని పదవులు చేశానన్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానని తీగల కృష్ణారెడ్డి స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి