హైదరాబాద్: అమీర్‌పేట్ ప్రభుత్వ ఆస్పత్రి ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ వార్

Oct 14 2021 @ 12:56PM

హైదరాబాద్: అమీర్ పేట్ ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ రగడ నెలకొంది. ఆస్పత్రి ప్రారంభోత్సవంలో ఫ్లెక్సీల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫోటో పెట్టకపోవడంపై బీజేపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ అమీర్‌పేట్ మాజీ కార్పొరేటర్ శేషు కుమారి అనుచరులతో వాగ్వాదానికి దిగారు. పరస్పర నినాదాలతో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో వాతావరణం ఉద్రిక్తతగా మారింది. దీంతో సభలో ప్రసంగించకుండానే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెళ్లిపోయారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.