
హైదరాబాద్: భాగ్యనగరంలో కనుమ పండుగ సందడి నెలకొంది. నాన్ వెజ్ షాపుల ముందు రద్దీ పెరిగింది. చికెన్, మటన్‌కు డిమాండ్ పెరిగింది. మాంసం కొనుగోళ్లకోసం జనం గంటలకొద్దీ క్యూ లైన్లలో నిలుచున్నారు. కాగా భోగి, సంక్రాంతి పండుగను రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో సంబరంగా జరుపుకున్నారు. రెండు రోజుల పాటు ఆనందోత్సాహాలతో గడిపిన ప్రజలు మూడో రోజు కనుమ పండుగను విశిష్టంగా జరుపుకుంటున్నారు.