తెలంగాణ పోలీస్ శాఖలో కరోనా కలకలం

ABN , First Publish Date - 2022-01-17T21:24:52+05:30 IST

హైదరాబాద్: తెలంగాణ పోలీస్ శాఖను కరోనా కలవరం పెడుతోంది.

తెలంగాణ పోలీస్ శాఖలో కరోనా కలకలం

హైదరాబాద్: తెలంగాణ పోలీస్ శాఖను కరోనా కలవరం పెడుతోంది. ప్రతి పోలీస్ స్టేషన్‌లోనూ సిబ్బంది కోవిడ్ బారిన పడుతున్నారు. థర్డ్ వేవ్‌లో తెలంగాణ వ్యాప్తంగా 5వందల మంది పోలీస్ సిబ్బందికి పాజిటీవ్‌గా నిర్ధారణ అయింది. మూడు కమిషనరేట్ల పరిధిలో కరోనా కేసులు పెరగడంతో పోలీసులు భయపడుతున్నారు. ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా సేవలందించిన పోలీసులకు మొదటి దశలో 2వేల మందికి కోవిడ్ సోకింది. అప్పుడు 50 మంది పోలీసులు మృతి చెందారు. సెకండ్ వేవ్‌లోనూ 7 వందల మంది కరోనా బారిన పడ్డారు. ఇప్పుడు థర్డ్ వేవ్‌లో 5 వందల మంది పోలీసులకు పాజిటీవ్ అని తేలడంతో కలవరపడుతున్నారు. విధులు నిర్వహించాలంటే భయపడుతున్నారు. అటు జిల్లాల్లోనూ ఖాకీలను పరేషాన్ చేస్తోంది. ప్రతి పోలీస్ స్టేషన్‌లోనూ కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. పాజిటీవ్‌లు పెరుగుతుండడంతో పోలీస్ స్టేషన్‌లలో ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఫిర్యాదు చేయడానికి ఒక్కరిని మాత్రమే అనుమతిస్తున్నారు. తెలంగాణలో పోలీసులకు దాదాపు 90 శాతం వ్యాక్సినేషన్ పూర్తి అయింది. కేసుల సంఖ్య పెరుగుతుండడంతో పోలీసులకు బూస్టర్ డోసు అందించాలని నిర్ణయించారు.

Updated Date - 2022-01-17T21:24:52+05:30 IST