తెలంగాణ విద్యాశాఖ సంచలన నిర్ణయం

ABN , First Publish Date - 2022-01-23T20:26:20+05:30 IST

తెలంగాణ విద్యాశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. 8, 9, 10 తరగతుల విద్యార్థులకు...

తెలంగాణ విద్యాశాఖ సంచలన నిర్ణయం

హైదరాబాద్: తెలంగాణ విద్యాశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. 8, 9, 10 తరగతుల విద్యార్థులకు విద్యాబోధనను ఆన్ లైన్‌లో అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో విద్యా సంస్థల సెలవులను ఈనెల 30 వరకు పొడిగించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు సోమవారం నుంచి ఆన్ లైన్ తరగతులు నిర్వహించుకోవచ్చునని ఉత్తర్వుల్లో అధికారులు స్పష్టం చేశారు. అదే రోజు నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది 50 శాతం చొప్పున రోజు విడిచి రోజు పాఠశాలలకు హాజరు కావాలని అధికారులు సూచించారు.


జేఎన్టీయూ సయితం తమ పరిధిలోని అన్నీ యూజీ, పీజీ కళాశాలలు ఈ నెల 30 వరకు ఆన్ లైన్‌లోనే తరగతులు నిర్వహించాలని సూచించింది. ఈ మేరకు వర్శిటీ రిజిస్ట్రార్ అనుబంధ కాలేజీలకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఏప్రిల్‌లో జగనున్న ఇంటర్ ప్రథమ, ద్వితీయ వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపును ఇంటర్ బోర్డు పొడిగించింది. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా వచ్చేనెల 4 వరకు చెల్లించవవ్చునని, ఆ తర్వాత రూ. 2వందల రుసుముతో వచ్చేనెల 10 వరకు, వ్యెయ్యితో 17 వరకు, 2వేలతో 24వ తేదీ వరకు చెల్లించవ్చునని ఇంటర్ బోర్డు కార్యదర్శి తెలిపారు. గత ఏడాది అక్టోబర్‌లో ప్రథమ ఏడాది పరీక్షలు రాసిన ద్వితీయ సంవత్సర రెగ్యులర్ విద్యార్థులు పాసైన సబ్జెక్టులకు సంబంధించిన బెటర్మెంట్ పరీక్షలను ఏప్రిల్‌లో రాసుకోవచ్చునని బోర్డు తెలిపింది.

Updated Date - 2022-01-23T20:26:20+05:30 IST