
హైదరాబాద్: శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణానికి గోటి తలంబ్రాలను భక్తులు సిద్ధం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మీర్పేట్ కార్పొరేషన్ శివసాయినగర్కు చెందిన భక్తులు గోటి తలంబ్రాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. భద్రాచలంలో ఏప్రిల్ 10న నిర్వహించే సీతారాముల కల్యాణానికి ఈ గోటి తలంబ్రాలను పంపిస్తామని శ్రీ లక్ష్మి గణపతి ఆలయ పూజారి కృష్ణారావు చెప్పారు. భద్రాచలం నుంచి తెప్పించిన వడ్లతో గోటి తలంబ్రాలు తయారు చేశామని ఆలయ కమిటీ ప్రతినిధులు వివరించారు.