Hyderabad: పోలీస్ స్టేషన్ కూతవేటు దూరంలో హత్య

ABN , First Publish Date - 2022-09-12T17:17:10+05:30 IST

లంగర్‎హౌస్‎లో దారుణ హత్య జరిగింది. పోలీస్ స్టేషన్ కూతవేటు దూరంలో హత్య నగరంలో కలకలం రేపుతోంది. షేక్ ఫరీద్ అనే వ్యక్తిని

Hyderabad: పోలీస్ స్టేషన్ కూతవేటు దూరంలో హత్య

Hyderabad: లంగర్‎హౌస్‎లో దారుణ హత్య(murder) జరిగింది. పోలీస్ స్టేషన్ కూతవేటు దూరంలో హత్య నగరంలో కలకలం రేపుతోంది. షేక్ ఫరీద్ అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు దారుణ హత్య చేశారు. ఒమేగా హోటల్ వెనకాల ఆటోలో మృతదేహన్ని స్థానికులు గమనించారు. ఆటోలో ఉన్న బాడీ వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు..పరిశీలించారు.  మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి పోలీసులు తరలించారు. వివాహేతర సంబంధంతోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంట్లో హత్య చేసి మృతదేహాన్ని ఆటోలో వదిలి వెళ్లారా అనే కోణంలో పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Updated Date - 2022-09-12T17:17:10+05:30 IST