Queen Elizabeth II : క్వీన్ ఎలిజబెత్‌కు నిజాం పెళ్లి కానుక ఇదే!

ABN , First Publish Date - 2022-09-09T22:26:14+05:30 IST

బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్-2 (Queen Elizabeth II)కు పెళ్లి

Queen Elizabeth II : క్వీన్ ఎలిజబెత్‌కు నిజాం పెళ్లి కానుక ఇదే!

హైదరాబాద్ : బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్-2 (Queen Elizabeth II)కు పెళ్లి కానుకగా హైదరాబాద్ నిజాం రాజు 1947లో దాదాపు 300 వజ్రాలను పొదిగిన అత్యంత ఆకర్షణీయమైన ప్లాటినమ్ నెక్లెస్‌ను బహూకరించారు. క్వీన్ గురువారం 96 సంవత్సరాల వయసులో పరమపదించిన సంగతి తెలిసిందే. ఆమె గౌరవార్థం మన దేశంలో ఆదివారం జాతీయ సంతాప దినంగా పాటిస్తారు. 


1952లో రాణిగా బాధ్యతలు చేపట్టిన ఎలిజబెత్-2 తన పాలనా కాలంలో అనేక విలువైన బహుమతులను స్వీకరించారు. వాటిలో ఒకటి నిజాం రాజు బహూకరించిన ప్లాటినం నెక్లెస్ సెట్. దీనిని ఫ్రెంచ్ లగ్జరీ బ్రాండ్ కార్టియర్ (Cartier) తయారు చేసింది. దీనిలో 300 వజ్రాలను పొదిగారు. రాయల్ ఫ్యామిలీ వెల్లడించిన వివరాల ప్రకారం, నిజాం రాజు ఈ బహుమతిని తయారు చేయించడానికి కార్టియర్ సంస్థను ఎంపిక చేసుకున్నారు. ఎలిజబెత్ ఎంపిక చేసుకున్న డిజైన్‌తో నెక్లెస్ సెట్‌ను తయారు చేయాలని ఆదేశించారు. ఎలిజబెత్ ఈ ప్లాటినం నెక్లెస్‌ను ఎంపిక చేసుకున్నారు. ఆమె ఈ నెక్లెస్‌ను ధరించి  తీయించుకున్న ఫొటోలు అనేకం ఉన్నాయి. దీనిని ఆమె డచెస్ ఆఫ్ కేంబ్రిడ్జ్ కేట్ మిడిల్‌టన్‌కు ఇచ్చారు. కేట్ దీనిని ధరించి 2014లో నేషనల్ పోర్ట్రయిట్ గ్యాలరీ కార్యక్రమానికి హాజరయ్యారు. 2019లో డిప్లమేటిక్ కార్ప్స్ రిసెప్షన్‌లో కూడా దీనిని ధరించి పాల్గొన్నారు. 


Updated Date - 2022-09-09T22:26:14+05:30 IST