Hyderabad: పాతబస్తీలో బైకర్స్ వీరంగం

ABN , First Publish Date - 2022-06-15T13:49:28+05:30 IST

నగరంలోని పాతబస్తీ కాలాపత్తర్‌లో రాత్రిపూట బైకర్స్‌ వీరంగం సృష్టించారు.

Hyderabad: పాతబస్తీలో బైకర్స్ వీరంగం

హైదరాబాద్‌: నగరంలోని పాతబస్తీ కాలాపత్తర్‌లో రాత్రిపూట బైకర్స్‌ వీరంగం సృష్టించారు. కాలనీలో బైక్‌లతో  యువత ర్యాష్‌ డ్రైవింగ్‌ చేస్తూ హంగామా చేశారు. అడ్డుకున్న ఓ యువకుడిని బైకర్స్ చితకబాదారు. ఇంట్లోకి దూరి మరీ దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. కుటుంబసభ్యులు వెంటనే వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.  సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 

Updated Date - 2022-06-15T13:49:28+05:30 IST