రూబీ గోల్డ్‌ స్కాంలో యజమాని ఇఫ్సర్‌ రెహమాన్‌ అరెస్ట్

ABN , First Publish Date - 2021-01-25T01:10:33+05:30 IST

బీహెచ్‌ఈఎల్‌లోని ఓ ఇంట్లో పోలీసుల సోదాలు నిర్వహించారు. తమిళనాడు, తెలంగాణ పోలీసులు సంయుక్త తనిఖీలు చేపట్టారు.

రూబీ గోల్డ్‌ స్కాంలో యజమాని ఇఫ్సర్‌ రెహమాన్‌ అరెస్ట్

హైదరాబాద్‌: బీహెచ్‌ఈఎల్‌లోని ఓ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. తమిళనాడు, తెలంగాణ పోలీసులు సంయుక్త తనిఖీలు చేపట్టారు. చెన్నైలోని రూబీ గోల్డ్‌ స్కాంలో యజమాని ఇఫ్సర్‌ రెహమాన్‌‌ను అరెస్ట్‌ చేశారు. వడ్డీలేని రుణాలు ఇస్తానని భారీగా ఆభరణాలు తీసుకుని..దాదాపు 1500 మందిని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. రూ.300 కోట్లు విలువైన వెయ్యి కిలోల బంగారాన్ని ఆయన సేకరించారు. బంగారు విలువకు మూడొంతుల డబ్బు ఇస్తానని నమ్మించి మోసాలకు పాల్పడ్డట్లు పోలీసులు గుర్తించారు. 2019 నుంచి రూబీ గోల్డ్‌ యజమాని ఇఫ్సర్‌ రెహమాన్‌ పరారీలో ఉన్నాడు. ఇఫ్సర్‌ సోదరుడు అనీస్‌ రెహమాన్‌, మరో ముగ్గురు మహిళలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Updated Date - 2021-01-25T01:10:33+05:30 IST