
హైదరాబాద్: డ్రగ్స్ కేసులో హైదరాబాద్ పోలీసులు దూకుడు పెంచారు. డ్రగ్స్ కేసుకు సంబంధించి ఈడీకి హైదరాబాద్ పోలీసులు సమాచారం ఇచ్చారు. డ్రగ్స్‌లో హవాలా, మనీలాండరింగ్ ఉందని పోలీసులు చెబుతున్నారు. హవాలా డబ్బులతో వ్యాపారస్తులు డ్రగ్స్‌ను కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. మనీలాండరింగ్ ద్వారా డబ్బును పెద్దమొత్తంలో విదేశాలకు నిందితుడు టోనీ పంపినట్లు పోలీసులు చెబుతున్నారు. హవాలా, మనీలాండింగ్ వ్యవహారాన్ని పోలీసులు నిగ్గు తేల్చే పనిలో పడ్డారు.
ఇవి కూడా చదవండి