రామకృష్ణ మఠంలో పుస్తకాలపై 40 శాతం డిస్కౌంట్

Published: Mon, 24 Jan 2022 22:11:16 ISTfb-iconwhatsapp-icontwitter-icon
రామకృష్ణ మఠంలో పుస్తకాలపై 40 శాతం డిస్కౌంట్

హైదరాబాద్: వివేకానంద జయంతి సందర్భంగా జనవరి 25న (తిథి ప్రకారం) రామకృష్ణ మఠంలో పుస్తకాలపై 40 శాతం డిస్కౌంట్ లభించనుంది. వివేకానంద సాహిత్యంతో పాటు అనేక పుస్తకాలపై ఈ డిస్కౌంట్ అందుబాటులో ఉంటుందని రామకృష్ణ మఠం ప్రతినిధులు తెలిపారు.


ఉదయం ఐదున్నరకు సుప్రభాతం, మంగళారతి, భజనలుంటాయి. 7 గంటలకు విశేష పూజ, భజనలు  పదిన్నరకు హోమం నిర్వహిస్తారు. 11 గంటలా 15 నిమిషాలకు స్వామి వివేకానంద జీవితం, సందేశంపై తెలుగులో ప్రసంగం ఉంటుంది. 11 గంటలా 40 నిమిషాలకు స్వామి వివేకానంద జీవితం, సందేశంపై ఆంగ్లంలో ప్రసంగం ఉంటుంది. 12:05 నిమిషాలకు విశేష హారతి, మధ్యాహ్నం 12:15 గంటలకు భోజన ప్రసాదం ఉంటుంది. సాయంత్రం 6:45కు ఆరాత్రికం, 7:15కు ప్రత్యేక భజనలుంటాయి.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.