అర్ధరాత్రి కారు బీభత్సం...టీఆర్ఎస్ నేత బంధువునంటూ..

ABN , First Publish Date - 2020-11-28T18:33:55+05:30 IST

నగరంలోని జూబ్లీహిల్స్‌లో అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. నీరూస్ చౌరస్తాలో హైస్పీడ్‌లో వచ్చిన ఆడి కారు ముందు కారును ఢీకొట్టింది.

అర్ధరాత్రి కారు బీభత్సం...టీఆర్ఎస్ నేత బంధువునంటూ..

హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్‌లో అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. నీరూస్ చౌరస్తాలో హైస్పీడ్‌లో వచ్చిన ఆడి కారు ముందు కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముందు కారులో ఉన్న కుటుంబసభ్యులకు గాయాలయ్యాయి. పోలీసుల చెక్ పాయింట్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులతో ఆడి కారులోని వ్యక్తి వాగ్వాదానికి దిగాడు. టీఆర్ఎస్ లీడర్ బంధువునంటూ పోలీసులతో ఘర్షణకు పాల్పడ్డాడు. అతడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళుతుండగా కానిస్టేబుల్‌ను తోసి అక్కడి నుంచి వేగంగా పరారయ్యాడు. కారు నడిపిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2020-11-28T18:33:55+05:30 IST