HYD: శంషాబాద్‌లో స్పైస్‌‌జెట్ విమానం అత్యవసర ల్యాండింగ్

ABN , First Publish Date - 2022-01-14T15:54:46+05:30 IST

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్పైస్ జెట్ విమానం అత్యవసర ల్యాండింగ్ అయ్యింది.

HYD: శంషాబాద్‌లో స్పైస్‌‌జెట్ విమానం అత్యవసర ల్యాండింగ్

హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్పైస్ జెట్ విమానం అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. ఈరోజు ఉదయం 7:45 గంటలకు స్పైస్ జెట్ విమానం హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ నుండి తిరుపతికి బయలుదేరింది. అయితే తిరుపతి విమానాశ్రయంలో వాతావరణం అనుకూలించక పోవడంతో తిరిగి హైదరాబాద్‌కు వచ్చేసింది. దట్టమైన పొగమంచు కారణంగా ఏటీసీ అధికారులు విమానం ల్యాండింగ్‌కు అనుమతించలేదు. 

Updated Date - 2022-01-14T15:54:46+05:30 IST