Hyderabadలో యువకుడిపై దాడి

ABN , First Publish Date - 2022-05-05T16:55:45+05:30 IST

నగరంలోని లంగర్ హౌజ్‌లో యువకుడిపై గుర్తు తెలియని యువకులు దాడి చేశారు. విచక్షణారహితంగా యువకుడిని యువకులు చితకబాదారు.

Hyderabadలో యువకుడిపై దాడి

హైదరబాద్: నగరంలోని లంగర్ హౌజ్‌లో యువకుడిపై గుర్తు తెలియని యువకులు దాడి చేశారు. విచక్షణారహితంగా యువకుడిని యువకులు చితకబాదారు. బాధితుడు లంగర్‌హౌజ్‌కు చెందిన నిఖిల్‌గా గుర్తించారు. యువకుల చేతిలో నిఖిల్ తీవ్రగాయాలపాలయ్యాడు. విషయం తెలిసిన వెంటనే కుటుంబసభ్యులు నిఖిల్‌ను ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తన స్నేహితుడిని దూల్పేట్‌లోని జాలిహనుమాన్ దగ్గర డ్రాప్ చేసి ఇంటికి వస్తున్న నిఖిల్‌పై లంగర్‌హౌజ్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనపై నిఖిల్ కుటుంబసభ్యులు లంగర్‌హౌజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Read more