HYD: వనస్థలిపురం బ్యాంక్ ఆఫ్ బరోడా క్యాషియర్ కేసులో ట్విస్ట్

ABN , First Publish Date - 2022-05-12T18:34:48+05:30 IST

నగరంలోని వనస్థలిపురం బ్యాంక్ ఆఫ్ బరోడా క్యాషియర్ కేసులో ట్విస్ట్‌లు మీద ట్విస్ట్‌లు బయటపడుతున్నాయి.

HYD: వనస్థలిపురం బ్యాంక్ ఆఫ్ బరోడా క్యాషియర్ కేసులో ట్విస్ట్

హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురం బ్యాంక్ ఆఫ్ బరోడా క్యాషియర్ కేసులో ట్విస్ట్‌లు మీద ట్విస్ట్‌లు బయటపడుతున్నాయి. బ్యాంకు నుండి డబ్బులు తాను తీసుకెళ్ళలేదంటూ క్యాషియర్ ప్రవీణ్ సెల్ఫీ వీడియో పంపాడు. అయితే బుధవారం డబ్బు తానే తీసుకెళ్లినట్లు ప్రవీణ్ ఒప్పుకున్న విషయం తెలిసిందే. తాను బెట్టింగ్ లో డబ్బు కోల్పోయానని మెసేజ్ పెట్టాడు. అయితే ఈరోజు తాను డబ్బు తీయలేదంటూ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. బ్యాంకులో నగదు లావాదేవీల్లో తక్కువగా వచ్చిన నగదును తనపై పడేస్తున్నారని.... బ్యాంకు మేనేజర్, సిబ్బంది పట్టించుకోవడం లేదని వాపోయాడు. గతంలోనూ పలుమార్లు నగదు తక్కువగా ఉండటంపై నిలదీసినా మేనేజర్ పట్టించుకోలేదని తెలిపాడు. బ్యాంకు మేనేజర్ వినయ్ కుమార్ నిర్లక్ష్యం కారణంగానే ఇదంతా జరుగుతోందని, అనవసరంగా తనను బ్లేమ్ చేస్తున్నారని ఆరోపించాడు. బ్యాంకులో సరైన నిఘా లేదని క్యాషియర్ ప్రవీణ్ సెల్ఫీ వీడియోలో తెలిపాడు.

Read more