Minister Ktr Tweet‎కు తీవ్ర స్థాయిలో కౌంటర్లు

ABN , First Publish Date - 2022-07-24T01:57:14+05:30 IST

తన కాలుకు శస్త్ర చికిత్స జరిగిందని.. మూడు వారాల పాటు రెస్ట్ తీసుకుంటున్నట్లు మంత్రి కేటీఆర్ (Minister Ktr) ట్వీట్ చేశారు.. అలాగే ...

Minister Ktr Tweet‎కు తీవ్ర స్థాయిలో కౌంటర్లు

హైదరాబాద్ (Hyderabad): తన కాలుకు శస్త్ర చికిత్స జరిగిందని.. మూడు వారాల పాటు రెస్ట్ తీసుకుంటున్నట్లు మంత్రి కేటీఆర్ (Minister Ktr) ట్వీట్ చేశారు.. అలాగే మూడు నెలలు రెస్ట్ తీసుకుంటున్నానని తెలిపారు. ఈ మూడు నెలల సమయంలో కాలక్షేపం కోసం ఓటీటీలో మంచి సినిమాలు ఉంటే చెప్పాలని.. తాను చూస్తానని నెటిజన్లను ఆయన కోరారు. అయితే మంత్రి కేటీఆర్ ట్వీట్‎కు తీవ్ర స్థాయిలో కౌంటర్ ట్వీట్లు పడుతున్నాయి.. ఖాళీగా ఉండి సినిమాలు చూసే బదులు జూమ్ మీటింగ్ ద్వారా వరద బాధితుల కష్టాలను తెలుసుకోవని ట్వీట్స్ చేస్తున్నారు. అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లు నిర్వహించి వరద బాధితులకు సహాయ కార్యక్రమాలు అందించొచ్చని  నెటిజన్లు సలహాలు ఇస్తున్నారు. హైదరాబాద్‎లో వరదలు వస్తుంటే.. రెస్ట్ పేరుతో బాధితులను పరామర్శించకుండా తప్పించుకుంటున్నారని మరికొందరు ట్వీట్ పెడుతున్నారు.  వరదలు వచ్చి అన్ని మునిగిపోతుంటే.. సినిమాలేంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. గతంలో కూడా వర్షాలు వచ్చిన నేపథ్యంలో టీఆర్ఎస్ (Trs) ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి.



Updated Date - 2022-07-24T01:57:14+05:30 IST