
హైదరాబాద్ సిటీ/చిక్కడపల్లి : ప్రేమ అనే పద్మవ్యూహంలో చిక్కుకుని యువత నేడు విలవిల్లాడుతోందని ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు డా. హిప్నో పద్మాకమలాకర్ అన్నారు. ఫిబ్రవరి 14న వాలెంటైన్‌ను ఉరితీస్తే, నేటి యువత వారిని వారే ఉరి తీసుకుంటున్నారన్నారు. శుక్రవారం అశోక్‌నగర్‌లోని కమలాకర్స్ మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్ హాల్లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ పెద్దలు అమ్మాయిలకు 12 సంవత్సరాలు రాగానే ఆంక్షలు విధించడం, అబ్బాయిలను స్వేచ్ఛగా వదలడంతోనే ప్రేమ అనే ఆకర్షణ వైపు తొంగి చూస్తున్నారన్నారు. దేశాభివృద్ధికి, సమాజ సంక్షేమానికి యువత శక్తి ఉపయోగపడేట్టు మనమంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కోశాధికారి పి స్వరూపరాణి, గైనకాలజిస్ట్ డా. కె నాగేశ్వరీరావు మాట్లాడారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు, యువత పాల్గొన్నారు.