ఆర్టీసీ బస్సుల్లో హైపోక్లోరైడ్‌ పిచికారి

ABN , First Publish Date - 2021-04-24T04:42:34+05:30 IST

జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్సు డిపోలోని బస్సులను శుక్రవారం అధికారులు సోడియం హైపోక్లోరైడ్‌ పిచికారి చేశారు.

ఆర్టీసీ బస్సుల్లో హైపోక్లోరైడ్‌ పిచికారి
ఆర్టీసీ బస్సులో హైపోక్లోరైడ్‌ పిచికారి చేస్తున్న సిబ్బంది

ఆసిఫాబాద్‌, ఏప్రిల్‌ 23: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్సు డిపోలోని బస్సులను శుక్రవారం అధికారులు సోడియం హైపోక్లోరైడ్‌ పిచికారి చేశారు. కరోనావైరస్‌ సెకండ్‌వేవ్‌ ఉధృతంగా ఉన్నందున ప్రయాణికు లకు వైరస్‌ సోకకుండా అన్ని జాగ్రత్తలను చేపడు తున్నట్లు డిపోమేనేజర్‌ కృష్ణమూర్తి తెలిపారు. ప్రయాణికులు బస్సులలో ప్రయాణించేటప్పుడు విధిగా మాస్క్‌లను ధరించాలని కొరారు.

విద్యాసంస్థల్లో..

కెరమెరి: మండలంలోని రాంనగర్‌, కొటారి, రెంగన్‌ ఘాట్‌, భీమన్‌గోంది, గోయ గాం తదితర గ్రామాల్లో శుక్రవారం ఎంపీవో మహేందర్‌రెడ్డి పాఠశా లలు, ఐసీడీఎస్‌ కేంద్రా లలో సోడియం హైపోక్లో రైడ్‌ ద్రావణాన్ని పిచికారి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైరస్‌ రెండో దశ విస్తృ తంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూవిధిగా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలన్నారు. అదేవిధంగా 45సంవత్సరాలు నిండిన వారు టీకాలు వేసుకోవాలని సూచించారు. ఆయన వెంట కార్యదర్శులు విష్ణువర్ధన్‌, ఈశ్వర్‌ ఉన్నారు. 

Updated Date - 2021-04-24T04:42:34+05:30 IST