Advertisement

ఆయన దృష్టిలో నేనే సూపర్‌స్టార్‌!

Jan 17 2021 @ 00:04AM

‘‘మా ఆయన దృష్టిలో నేనే సూపర్‌స్టార్‌. పెళ్లి తర్వాత మేం సంతోషంగా ఉన్నాం. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నాం. మంచి పాత్రల్లో నటించాలనుకుంటున్నా. ఒకే తరహా పాత్రలకు పరిమితం అవ్వాలనుకోవడం లేదు. నాకు డ్యాన్స్‌ చేయడం ఇష్టం. ప్రత్యేక గీతాలు, గ్లామర్‌ పాత్రలు చేయడం వల్ల అవకాశాలు తగ్గుతాయని అనుకోను’’ అని అర్చన అన్నారు. బాలదిత్యకు జంటగా ఆమె నటించిన ‘అన్నపూర్ణమ్మగారి మనవడు’ ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా అర్చన మాట్లాడుతూ ‘‘సినిమాలో ప్రేమించినవాడి కోసం ఎంత దూరమైనా వెళ్లే పాత్ర చేశా. వైద్య విద్యార్థిగా మొదలై, ప్రేమ పెళ్లి చేసుకోవడం వరకూ ఉంటుంది. సమాజంలో పరువు హత్యలను దర్శకుడు నర్రా శివనాగేశ్వరరావుగారు నా పాత్ర ద్వారా ప్రస్తావించారు. నటనకు ఆస్కారమున్న పాత్ర చేశా. చిన్నతనంలో అన్నపూర్ణమ్మ, జమునగారి చిత్రాలు చూశా. వాళ్లతో నటించడం సంతోషంగా ఉంది. కుటుంబమంతా కలిసి చూసే చిత్రమిది. కె. విశ్వనాథ్‌గారు చూసి బావుందని ప్రశంసించారు’’ అని చెప్పారు.

Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.