AP News: పని ఫలితం ప్రజలకు చేరితే అదే నాకు సంతోషం: చంద్రబాబు

ABN , First Publish Date - 2022-09-01T23:07:31+05:30 IST

Amaravathi: టీడీపీ అధినేత చంద్రబాబు తొలిసారి సీఎం పదవి చేపట్టి నేటికి 27 ఏళ్లయ్యింది. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో చిట్‌చాట్‌గా మాట్లాడారు.

AP News: పని ఫలితం ప్రజలకు చేరితే అదే నాకు సంతోషం: చంద్రబాబు

Amaravathi: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandra Babu Naidu) తొలిసారి సీఎం పదవి చేపట్టి నేటికి 27 ఏళ్లయ్యింది. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో చిట్‌చాట్‌గా మాట్లాడారు.   

‘27 ఏళ్ల క్రితం మొదలైన మార్పు..ఇప్పుడు ఉత్తమ ఫలితాలనిస్తోంది. పాలకులు చేసిన పనులు చరిత్రలో ఉన్నాయి.. అదే నాకు సంతృప్తి. నేను చేసిన ప్రతిపని ప్రజలు గుర్తుపెట్టుకోవాలని కోరుకోను. పని ఫలితం ప్రజలకు చేరితే అదే నాకు సంతోషం.’ అని పేర్కొన్నారు.  


పాలకుడికి ఉండాల్సింది విజన్..విద్వేషం కాదు.. 

‘అమరావతిని ప్రణాళికతో అభివృద్ధి చేసేందుకు ప్రయత్నించాం. పాలకుడికి ఉండాల్సింది విద్వేషం కాదు..విజన్ అని గుర్తించాలి. అమరావతికి వచ్చిన సంస్థలను కొనసాగించినా ఉత్తమ ఫలితాలు వచ్చేవి. జగన్‌ పాలనలో ఏపీలోని అన్నిరంగాలు, వ్యవస్థలు నాశనమయ్యాయి. రాజకీయం వేరు, అభివృద్ధి వేరు.. నేను అదే ఫాలో అయ్యాను. రాష్ట్ర విభజన వల్ల ఏపీకి జరిగిన నష్టం కంటే..సీఎం జగన్‌ వల్ల రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరుగుతోంది. ఏపీని పునర్‌నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది.’ అని చంద్రబాబు అన్నారు


జైలుకు వెళ్లినా జగన్‌కు పరివర్తన రాలేదు.

‘పార్టీ అభివృద్ధి కోసం కష్టపడేవారికే అవకాశమిస్తాం. పొలిటికల్ ఫైట్‌తో పాటు లీగల్ ఫైట్ కూడా చేయాలి. టీడీపీ వస్తే సంక్షేమ పథకాలు పోతాయంటూ వైసీపీ దుష్ప్రచారం చేస్తుంది. సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టింది టీడీపీనే. టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తే రెట్టింపు సంక్షేమం. సంక్షేమం గురించి అవగాహన లేనివాళ్లే మాపై విమర్శలు చేస్తున్నారు. సొసైటీ పట్ల మినిమం కమిట్మెంట్ లేని వ్యక్తి.. సీఎం జగన్. ఏపీ ఎంతగా నష్టపోయిందో ఇప్పుడు అంతా చూస్తున్నాం. తప్పులు చేసి జైలుకు వెళ్లినా జగన్‌కు పరివర్తన రాలేదు. అప్పుడు లేపాక్షిలో కమీషన్‌లు తీసుకున్నారు..ఇప్పుడు మొత్తం భూములనే చేజిక్కించుకున్నారు’ అని చంద్రబాబు విమర్శించారు. 

Updated Date - 2022-09-01T23:07:31+05:30 IST