నేను రాజీనామాకు రెడీ: రఘురామకృష్ణరాజు

ABN , First Publish Date - 2021-08-04T22:07:13+05:30 IST

అమర్‌రాజా కంపెనీ తరలిపోవడంపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ చెరో మాట మాట్లాడుతున్నారని

నేను రాజీనామాకు రెడీ: రఘురామకృష్ణరాజు

ఢిల్లీ: అమర్‌రాజా కంపెనీ తరలిపోవడంపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ చెరో మాట మాట్లాడుతున్నారని ఎంపీ రఘురామకృష్ణరాజు తప్పుబట్టారు. మాజీ సీఎం దివంగత వైఎస్ఆర్‌ అమర్‌రాజా కంపెనీకి అదనపు భూకేటయింపులు చేశారని గుర్తుచేశారు. అప్పుడులేని తప్పులు ఇప్పుడు ఎలా కనపడ్డాయి? అని రఘురామ ప్రశ్నించారు. అన్ని శాఖల గురించి సజ్జలే మాట్లాడతారా, సజ్జల విశృంఖలత్వంగా వ్యవరిస్తున్నారని విమర్శించారు. ఎంపీ గోరంట్ల మాధవ్ తనను అంతు చూస్తా అన్నారని, ఆయనను అభినందించారని తెలిసిందన్నారు. 


‘‘ప్రెస్ మీట్ పెడితే లేపేస్తారా చూద్దాం. పిచ్చి ఉడుత ఊపులు ఉపకుండి. ప్రెస్ మీట్ పెడితే లేపేస్తారా. నేను చేస్తున్నది ధర్మ పోరాటం. విశాఖ ఉక్కుపై టీడీపీ ఎంపీలు రాజీనామా చేస్తామనడాన్ని స్వాగతిస్తున్నాను. నేను కూడా రాజీనామాకు రెడీ. వైసీపీ ఎంపీలందరం కలిసి రాజీనామాలు చేద్దాం. సీఎం జగన్ గారు కూడా ఢిల్లీ వచ్చి విశాఖ ఉక్కు కోసం పోరాడితే చాలా బాగుంటుంది. రాజ్యాంగానికి వ్యతిరేకంగా అప్పులు చేస్తున్నట్లు.. నేను కేంద్రానికి ఫిర్యాదు చేస్తే ఆర్థిక శాఖ అధికారులను సస్పెండ్ చేశారు. ఆర్థిక అవకతవకలపై చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీకి లేఖ రాశా’’ అని రఘురామకృష్ణరాజు తెలిపారు.

Updated Date - 2021-08-04T22:07:13+05:30 IST