‘పోలీస్‌’ అంటే ఇష్టం

ABN , First Publish Date - 2022-05-16T19:04:11+05:30 IST

ప్రస్తుతం ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతున్నాను. నాకు పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ అంటే ఆసక్తి. ‘రా’, ‘ఐబి’, ‘ఎన్‌ఐఏ’ వంటి సంస్థల రిక్రూట్‌మెంట్‌ ఎలా ఉంటుందో వివరించగలరు. ..

‘పోలీస్‌’ అంటే ఇష్టం

ప్రస్తుతం ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతున్నాను. నాకు పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ అంటే ఆసక్తి. ‘రా’, ‘ఐబి’, ‘ఎన్‌ఐఏ’ వంటి సంస్థల రిక్రూట్‌మెంట్‌ ఎలా ఉంటుందో వివరించగలరు. 

- సుభాష్‌, వికారాబాద్‌


ఇంటర్‌ పూర్తికాగానే మీరు చదువుతోపాటు, శారీరక సామర్థ్యం పెంచుకోవడానికి ప్రయత్నించండి. గ్రాడ్యుయేషన్‌ పూర్తికాగానే సివిల్‌ సర్వీసు రాయడానికి అర్హత సంపాదిస్తారు. దీని ద్వారా ఐఏఎస్‌, ఐఎఫ్‌ఎస్‌తోపాటు మీకు ఇష్టమైన పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఐపీఎస్‌ కూడా సాధించవచ్చు.  వీటికి సంబంధించిన వివరాలు కావాలనుకుంటే www.upsc.gov.in వెబ్‌సైట్‌ చూడవచ్చు. సాధారణంగా పైన మీరు చెప్పిన ఏజెన్సీల్లో పనిచేసేవారంతా ఐపిఎస్‌ అధికారులే. వీరు డిప్యుటేషన్‌పై కొంతకాలం ఇందులో పనిచేస్తారు. తరవాత కేడర్‌కు చెందిన పోస్టులు అసిస్టెంట్‌ కమాండెంట్‌, డిప్యూటీ సూపరింటెండెంట్‌, సబ్‌ఇన్‌స్పెక్టర్‌ తదితర పోస్టులను స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌  ద్వారా భర్తీ చేస్తారు. వీటి రిక్రూట్‌మెంట్‌ కూడా రెగ్యులర్‌గానే జరుగుతుంది. తదుపరి డిపార్ట్‌మెంట్‌ పరీక్షలు రాసి ఉన్నత స్థానానికి చేరుకోవచ్చు. చదువుతోపాటు జీవితంలో క్రమశిక్షణ కలిగిన వ్యక్తులు మాత్రమే తాము అనుకున్న స్థానాన్ని సాధించగలుగుతారు. కేవలం కలలు కనడమేకాకుండా వాటిని సాధించడానికి ఆ మేరకు కృషి చేయండి.

Updated Date - 2022-05-16T19:04:11+05:30 IST