ltrScrptTheme3

తొలిసారి మాస్‌ సాంగ్‌ చేశాను

Oct 27 2021 @ 03:18AM

‘‘కథానాయికలకు నటనా ప్రాధాన్య పాత్రలు అరుదుగా లభిస్తాయి. ‘వరుడు కావలెను’లో నేను పోషించిన భూమి పాత్ర సవాల్‌తో కూడినది. ఇప్పటిదాకా నేను చేసిన పాత్రలకు భిన్నంగా ఉంటుంది’’ అని కథానాయిక రీతూవర్మ అన్నారు. లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో నాగశౌర్యకు జోడీగా ఆమె నటించిన ఈ చిత్రం ఈ నెల 29న థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా సినిమా విశేషాలను రీతూవర్మ పంచుకున్నారు. 


ట్రైలర్‌ను బట్టి ఇది కథానాయిక ప్రాధాన్య చిత్రం అనుకుంటే పొరబడిన ట్టే. ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించే సున్నితమైన ప్రేమకథా చిత్రం ఇది. ఫ నాగవంశీ గారు కథపైన నమ్మకంతో భారీగా నిర్మించారు. లక్ష్మీసౌజన్యకు దర్శకురాలిగా మంచి పేరు తెస్తుందనే నమ్మకం ఉంది. అమాయ కంగా కనిపించే పాత్రలో నదియా గారి నటన ప్రధానాకర్షణగా నిలుస్తుంది.  తొలిసారి ఈ సినిమాలో ఒక మాస్‌ సాంగ్‌ చేశాను. చాలా కష్టపడ్డాను. మాస్‌ ఆడియన్స్‌కు ఆ పాట బాగా నచ్చుతుంది. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.