నేను ఎంసెట్‌ రాస్తానంటే..

ABN , First Publish Date - 2022-05-23T09:04:58+05:30 IST

‘‘మా చిన్నతనంలో పెద్ద పెద్ద చదువులు చదివించడం కష్టంగా ఉండేది..

నేను ఎంసెట్‌ రాస్తానంటే..

  •  ఇంట్లో ఒప్పుకోలేదు
  • చెప్పకుండా వెళ్లి రాసి వచ్చా: మంత్రి సబిత


రెజిమెంటల్‌బజార్‌/సిటీబ్యూరో, మే 22 (ఆంధ్రజ్యోతి): ‘‘మా చిన్నతనంలో పెద్ద పెద్ద చదువులు చదివించడం కష్టంగా ఉండేది. ముఖ్యంగా అమ్మాయిలకు మరింత ఇబ్బందిగా ఉండేది’’ అని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆన్నారు. సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రిలో యంగ్‌ డాక్టర్స్‌ క్యాంపు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడారు. ‘‘నాకు డాక్టర్‌ కావాలని చాలా కోరిక ఉండేది. ఎంసెట్‌ రాస్తానని అడిగితే మా ఇంట్లో వద్దన్నారు. అంత పెద్ద ఖరీదైన చదువులు చదివించలేమన్నారు. అయినా ఇంట్లో చెప్పకుండా స్నేహితులతో కలిసివెళ్లి ఎంసెంట్‌ రాసి వచ్చా. అమ్మాయిలకు ఉత్తరం చదవడం.. పేరు రాయడం వస్తే చాలు అనేవారు. ఈ కార్యక్రమానికి వచ్చిన నాకు ఒక్కసారిగా నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. విద్యార్థి దశలోనే వైద్యరంగం పట్ల ఆసక్తిని కలిగించే కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ఆభినందనీయం’’ అని ఆమె కొనియాడారు. తొమ్మిదో తరగతి పూర్తి చేసుకుని పదోతరగతిలోకి వెళ్లే బాలబాలికలకు పది సంవత్సరాలుగా క్యాంప్‌ నిర్వహిస్తున్నట్లు యశోద ఆస్పత్రి డైరెక్టర్లు ధీరజ్‌ గోరుకంటి, పవన్‌ కుమార్‌ గోరుకంటి తెలిపారు.

Updated Date - 2022-05-23T09:04:58+05:30 IST