రాహుల్ చెవులెందుకు మూసుకుంటాడో నాకైతే అర్థం కావడం లేదు: గవాస్కర్

ABN , First Publish Date - 2022-04-18T22:51:17+05:30 IST

బ్రాబౌర్న్ స్టేడియంలో శనివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్

రాహుల్ చెవులెందుకు మూసుకుంటాడో నాకైతే అర్థం కావడం లేదు: గవాస్కర్

ముంబై: బ్రాబౌర్న్ స్టేడియంలో శనివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అజేయ సెంచరీతో అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో లక్నో విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. 19వ ఓవర్‌లో శతకం పూర్తి చేసుకున్న రాహుల్ ఆ వెంటనే తన ట్రేడ్‌మార్క్ స్టైల్ అయిన చెవులు మూసుకుని ధ్యానముద్రలోకి వెళ్లినట్టు కాసేపు మౌనంగా ఉండిపోయాడు. అది చూసిన ప్రేక్షకులు అతడు అలా చెవులు ఎందుకు మూసుకున్నాడో అర్థం కాక తలలు బద్దలుగొట్టుకున్నారు. 


రాహుల్ చెవులు మూసుకోవడం అతడి అభిమానులకే కాదు.. టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్‌కు కూడా అర్థం కాలేదు. రాహుల్ అలా చెవులు మూసుకుని సెలబ్రేట్ చేసుకోవడమేంటో తనకు ఇసుమంతైనా అర్థం కాలేదని అన్నాడు. రాహుల్ అలా చేయడం సరికాదని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. సెంచరీ చేసినప్పుడు ప్రేక్షకుల నుంచి వచ్చే కరతాళ ధ్వనులను అతడు వినలేకపోతున్నాడని అన్నాడు. నాలుగు పరుగులో, ఆరు పరుగులో చేసినప్పుడు అయితే ఇలా చెవులు మూసుకోవడం ఓకే కానీ, శతకం నమోదు చేసినప్పుడు దానిని ఎంజాయ్ చేయాలని అన్నాడు. ప్రేక్షకుల నుంచి వచ్చే అభినందనలను స్వీకరించాలని ‘స్టార్‌స్పోర్ట్స్’తో మాట్లాడుతూ గవాస్కర్ చెప్పుకొచ్చాడు.

Updated Date - 2022-04-18T22:51:17+05:30 IST