నా పేరు మీదే Sekhar సినిమా అన్ని అగ్రిమెంట్లు ఉంటాయి: బీరం సుధాకర్ రెడ్డి

Published: Tue, 24 May 2022 15:43:36 ISTfb-iconwhatsapp-icontwitter-icon
నా పేరు మీదే Sekhar సినిమా అన్ని అగ్రిమెంట్లు ఉంటాయి: బీరం సుధాకర్ రెడ్డి

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ (Rajasekhar) హీరోగా నటించిన చిత్రం ‘శేఖర్’ (Shekar).  మే 20న విడుదలై పాజిటివ్ టాక్‪  ఈ మూవీకి వచ్చింది. అయితే, విడుదలైన రెండవ రోజే ఈ చిత్రాన్ని థియేటర్లలో ప్రదర్శనను నిలిపివేశారు. దీనికి కారణం.. ఈ సినిమా నిర్మాణం నిమిత్తం దర్శకురాలు జీవితా రాజశేఖర్ (Jeevitha Rajasekhar) రూ. 64 లక్షలు తన వద్ద తీసుకుని.. సినిమా విడుదలైనా కూడా తిరిగి డబ్బు ఇవ్వలేదని ఫైనాన్షియర్ ఏ. పరంధామరెడ్డి (Parandhama Reddy) కోర్టును ఆశ్రయించారు. అనంతరం 48 గంటల్లో రూ. 64 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్ చేయకపోతే.. అన్ని ఫ్లాట్ ఫామ్స్ లో ‘శేఖర్’ చిత్రాన్ని నిలిపివేయాలని కోర్టు ఆర్డర్ వేసినట్లుగా పరంధామ రెడ్డి.. ఓ నోటీసును విడుదల చేశారు. 

అయినా, జీవిత ఆ అమౌంట్‪ను కట్టకపోవడంతో.. ఆదివారం సాయంత్రం నుండి థియేటర్లలో ‘శేఖర్’ సినిమాని నిలిపివేశారు. దీంతో  ‘శేఖర్’ చిత్ర టీమ్ కూడా కోర్టుని ఆశ్రయించారు. ఇక తాజాగా దీనికి సంబంధించి నిర్మాత నిర్మాత బీరం సుధాకర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘నా పేరు మీదే శేఖర్ సినిమా టైటిల్ సహా అన్ని అగ్రిమెంట్లు ఉంటాయి. సెన్సార్ సర్టిఫికేట్ సైతం‌ నిర్మాతగా నా పేరు మీదే ఉంది. శివాని, శివాత్మిక పేరు వారు ఇష్టపడి వేసుకున్నారు‌‌. లీగల్గా మాత్రం అన్నీ నా పేరునే ఉన్నాయి. సినిమా పదర్శనలను కోర్టు ఆపమనలేదు. సినిమా రైట్స్.. ఎటాచ్మెంట్ చేయమని కోర్టు చెప్పింది. అయినా క్యూబ్, యూఎఫ్ఓలు ప్రదర్శనలు ఆపాయి. గరుడ వేగ సినిమాకు నేను ఫైనాన్సియర్ని. జీవితా, ఆ చిత్ర నిర్మాతలకు మధ్య ఏం జరిగిందనేది నాకనవసరం. నాకు జరిగిన అన్యాయానికి ఎవరు బాధ్యత వహిస్తారు..? బాధ్యులపై చట్టపరమైన చర్యలకు వెళతాను. మళ్ళీ ‘శేఖర్’ సినిమా ప్రదర్శనలపై నేను నిర్ణయం తీసుకొలేదు. శేఖర్ సినిమాకు నేను రూ.15 కోట్లు ఇన్వెస్ట్ చేశాను. ఆల్రెడీ సినిమాను ఆపి చంపేశారు. నాకు డిజిటల్ పార్టనర్స్, పరంధామరెడ్డి వల్ల జరిగిన నష్టంపై క్లారిటీ ఇవ్వాలి. నష్టంపై క్లారిటీ వచ్చిన తర్వాతే ‘శేఖర్’ సినిమా ఓటీటీకి అమ్ముతాను’..అని అన్నారు.

ఇక అడ్వకేట్ రతన్ సింగ్ మాట్లాడుతూ...కోర్టు ‘శేఖర్’ సినిమా ప్రదర్శన ఆపమని చెప్పలేదు. సినిమా ప్రొజెక్షన్ ఆపటం ఇల్లీగల్. డిజిటల్ పార్ట్నర్ల వల్ల మాకు నష్టం వాటిల్లింది. శేఖర్ సినిమా ప్రదర్శనల ద్వారా రూ.65 లక్షలు వచ్చాయి. ఆ డబ్బును ప్రత్యేక ఖాతాలో సెక్యూరిటీ డిపాజిట్ చేయమని కోర్టు  చెప్పింది’..అని తెలిపారు. మరి ఈ వివాదం ఎప్పటికి సద్దుమణుగుతుందో మళ్ళీ చిత్రాన్ని థియేటర్స్‌లో ఎప్పుడు ప్రదర్శిస్తారో వేచి చూడాలి. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International